ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌, జేఎన్టీయూకే మధ్య ఎంవోయూ

ABN, Publish Date - May 30 , 2025 | 12:18 AM

భారత ప్రభుత్వ సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌, జేఎన్టీయూకే మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు ఇనచార్జి రిజిసా్ట్రర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. గురువారం జరిగిన కార్యక్రమంలో వీసీ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ హెచ్‌ భారతి హొల్లికేరి ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు.

అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న జేఎన్టీయూకే వీసీ, సీసీఎండీఆర్‌సీ ప్రతినిధులు

జేఎన్టీయూకే, మే 29 (ఆంధ్రజ్యోతి): భారత ప్రభుత్వ సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌, జేఎన్టీయూకే మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు ఇనచార్జి రిజిసా్ట్రర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. గురువారం జరిగిన కార్యక్రమంలో వీసీ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ హెచ్‌ భారతి హొల్లికేరి ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. వీసీ మాట్లాడుతూ ఈ ఎంవోయూ ద్వారా వర్శిటీలోని ఐఆర్‌సీలో సెంటర్‌ ఫర్‌ సెన్సస్‌ మైక్రోడేటా పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించామని, దీనికి యూసీఈకే వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవీఎస్‌ఆర్‌ దీక్షితులు నోడల్‌ అధికారిగా నియమితులయ్యారన్నారు. భారతి హల్లికేరి మాట్లాడుతూ జనగణనను ఇప్పటివరకు 15సార్లు చేపట్టామన్నారు. కొవిడ్‌ కారణంగా 16వ జనగణన చేపట్టలేదని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ హోమ్‌ అఫైర్స్‌ డిప్యూటీ రిజిసా్ట్రర్‌ జనరల్‌ శశికుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.సుప్రెజ్‌, రెక్టార్‌ కేవీ రమణ, ఓఎస్టీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు బాలకృష్ణ, కృష్ణప్రసాద్‌, పద్మజారాణి, గోపాలకృష్ణ, మాజీ వీసీలు శ్రీనివాస్‌కుమార్‌, పద్మరాజు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:18 AM