ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కట్టలు గుట్టలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:37 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పదేళ్లకుపైగా ఏ మాత్రం లావాదేవీలు జరగని అనక్లయిమ్డ్‌ డిపాజిట్లు రూ.145 కోట్లకుపైగా ఉన్నట్టు అంచనా వేశారు. ఈ డబ్బు కోసం పదేళ్ల నుంచీ ఎవరూ రాకపోవడంతో వాటిని ఆర్‌బీఐకి పంపేశారు. స్టేట్‌బ్యాంకు, యూనియన బ్యాంకు, గ్రామీణ బ్యాంకు తదితర ప్రభుత్వరంగ బ్యాంకు బ్రాంచల్లో రూ.90 కోట్ల వరకు డబ్బు పేరుకుపోయింది.

  • బ్యాంకుల్లో అన క్లయిమ్డ్‌ డిపాజిట్లు

  • ఉమ్మడి జిల్లాలో రూ.145కోట్లపైనే

  • పదేళ్లపైనుంచీ ఖాతాల్లో డబ్బులు

  • బ్యాంకుల్లో లావాదేవీలు నిల్‌

  • అనక్లయిమ్డ్‌ డిపాజిట్లుగా గుర్తింపు

  • ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.90 కోట్లు

  • ఆ తర్వాత హెచడీఎఫ్‌సీ,ఐసీఐసీఐ

  • 330 బ్రాంచల్లో కోట్లు

  • ఆర్‌బీఐకి పంపేసిన బ్యాంకులు

  • ఆధారాలతో వెళితే ఇచ్చేస్తారు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పదేళ్లకుపైగా ఏ మాత్రం లావాదేవీలు జరగని అనక్లయిమ్డ్‌ డిపాజిట్లు రూ.145 కోట్లకుపైగా ఉన్నట్టు అంచనా వేశారు. ఈ డబ్బు కోసం పదేళ్ల నుంచీ ఎవరూ రాకపోవడంతో వాటిని ఆర్‌బీఐకి పంపేశారు. స్టేట్‌బ్యాంకు, యూనియన బ్యాంకు, గ్రామీణ బ్యాంకు తదితర ప్రభుత్వరంగ బ్యాంకు బ్రాంచల్లో రూ.90 కోట్ల వరకు డబ్బు పేరుకుపోయింది. ఆ తర్వాత హెచడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకుల్లో రూ.35 కోట్ల వరకు నగదు ఉండిపోయింది. కొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల్లో నగదు ఉండిపోయినట్టు బ్యాంకులు గుర్తించాయి. అత్యధికంగా ఈ తరహా కేసులు నగరాలు, పట్టణాల పరిధిలో ఉన్నట్టు బ్యాంకులు విశ్లేషించాయి. ఆర్‌బీఐకి బదిలీ చేసిన తర్వాత ఖాతాలో బయటకు సున్నా బ్యాలెన్స చూపిస్తుంది. అందులో ఉండిపోయిన నగదు ఆర్‌బీఐ వద్దే ఉంటుంది.

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో బ్యాంకుల్లో జనం డబ్బు మూలుగుతోంది. ఏళ్ల తరబడి తీయకపోవడంతో కోట్లకు కోట్లు పేరుకుపోతోంది. ఒకటి కాదు రెం డుకాదు... పదేళ్లకుపైగా ఆయా బ్యాంకు ఖాతా ల్లో డబ్బులు తీయకపోవడంతో అవన్నీ అన క్ల యిమ్డ్‌ డిపాజిట్లుగా మారిపోతున్నాయి. ఆ డబ్బులను బ్యాంకులు చూసీచూసీ ఆర్‌బీఐకి పంపించేస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా 35 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెం దిన 330 బ్రాంచల్లో దాదాపుగా రూ.145 కోట్ల కుపైగా నగదు అనక్లయిమ్డ్‌ డిపాజిట్లుగా బ్యాం కులు గుర్తించాయి. అత్యధికంగా ఎస్‌బీఐ, యూ బీఐ తదితర బ్యాంకుల్లో డబ్బులు కోట్లలో పోగు పడగా, తర్వాత ప్రైవేటుబ్యాంకుల్లోను ఉన్నాయి.

పదేళ్లు దాటితే అంతే..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకులు 35 వరకు ఉండగా వీటన్నింటికి కలిపి 330 వరకు బ్రాంచలు న్నాయి. వీటిలో ప్రజలు మొత్తం రూ.48,500 కోట్ల వరకు డిపాజిట్లు చేశారు. ఒక్క కాకినాడ జిల్లాలోనే రూ.21,307 కోట్లు ఉన్నాయి. ఖాతా దారులు సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో డబ్బులు పొదుపు చేస్తారు. తరచూ ఖాతాలో డబ్బులు జమ చేయడం, వితడ్రా చేసుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాలు మాత్రం ఏళ్ల తరబడి అసలు ఏ లావాదేవీ జరగకుండా ఉండిపోతు న్నాయి. వీటిలో ఉన్న డబ్బులను వితడ్రా చేసు కోవడానికి ఎవరూ రావడం లేదు. ఆర్‌బీఐ ఆదే శాల మేరకు ఇలా ఏలావాదేవీ జరగని బ్యాంకు ఖాతాలపై ఆయా బ్రాంచలు కన్నేసి ఉంచుతా యి. తొలుత రెండేళ్ల పాటు ఏ లావాదేవీ జర గని ఖాతాలుంటే వాటిని నిర్వహణలో లేని ఖాతాగా గుర్తిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండి కూడా పదేళ్ల వరకు వాటిపై ఏలావాదేవీ జరగకపోతే దాన్ని అనక్లయిమ్డ్‌గా భావిస్తారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధా రంగా ఇలా పదేళ్ల పాటు ఉండిపోయిన బ్యాం కు ఖాతాలను ఆయా బ్యాంకులు ఆర్‌బీఐకి పం పాల్సి ఉంటుంది. దీన్నే డీఈఏ (డిపాజిటర్‌ ఎడ్యుకేషన అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌)గా పిలు స్తారు. ఒకవేళ ఆర్‌బీఐకి ఈ తరహా బ్యాంకు ఖాతాలను పంపకపోతే అందులో ఉన్న ఖాతా దారుల డబ్బు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నందున పదేళ్లు దాటిన ఖాతాల సొమ్మును ఆర్‌బీఐకి బ్యాంకులు పంపుతాయి.

తెలియక కొండలా..

ఖాతాదారుడి అకౌంట్‌లో డబ్బులు ఉన్నా ఆ తర్వాత చనిపోయిన ఘటనల్లో ఈ తరహా డిపాజిట్లు పేరుకుపోతున్నట్టు లీడ్‌బ్యాంకు అధి కారులు వివరించారు. ఖాతాదారుడు అవి వాహితుడో.. లేదంటే గుర్తుతెలియని ప్రదేశాల్లో చనిపోయి ఇప్పటికీ ఆచూకీ దొరకని ఘటనలు, ఖాతాదారుడు చనిపోగా, పిల్లలు,ఇతర రక్తసం బంధీకులు విదేశాల్లో ఉండిపోయి ఇక్కడకు రాని ఘటనల్లో ఈ తరహా అనక్లయిమ్డ్‌ డిపా జిట్లు పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఖాతాదా రుడి అకౌంట్లో డబ్బులున్నా సదరు వ్యక్తి మర ణం తర్వాత ఆ విషయం వారసులకు తెలియని ఘటనలు సైతం ఇందుకు దోహదం చేస్తున్నా యని తెలిపారు. కొందరు ఖాతాల్లో డబ్బులు న్నట్టు గుర్తించి వితడ్రాకు ప్రయత్నిస్తున్నా వారసత్వ ధ్రువీకరణ విషయంలో ఇబ్బందులు ఇందుకు కొంత కారణంగా మారుతున్నాయి. అనేకమంది ఫలానా ఖాతా తమ వారిదేనని వస్తున్నా అందుకుతగ్గ సరైన ఆధారాలు చూప డం లేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి.

కొవిడ్‌ తర్వాత ఇలా..

కొవిడ్‌ తర్వాత అనేక బ్యాంకు ఖాతాలు అన క్లయిమ్డ్‌ డిపాజిట్లుగా మారినట్టు బ్యాంకులు చెబుతున్నాయి. రిజర్వుబ్యాంకు ఆదేశాల మేర కు 2023లో 100 రోజులు 100 పేమెంట్స్‌ కిం ద అనక్లయిమ్డ్‌ డిపాజిట్లు తిరిగి చెల్లించేందు కు శ్రీకారం చుట్టింది.ప్రతి జిల్లాలో ప్రతి బ్యాం కు తమ టాప్‌ 100 అన క్లెయిమ్‌ డిపాజిట్ల కు సంబంధించి ఖాతాదారులను గుర్తించి నగ దు సెటిల్‌ చేయాలని కోరింది. కానీ ఉమ్మడి జిల్లాలో పెద్దగా ఈ ప్రయోగం ఫలించలేదు. ఖాతాదారులకు అందించేందుకు ఆర్‌బీఐ ఉద్గ మ్‌ (అనక్లెయిమ్డ్‌ డిపాజిట్లు -గేట్‌వే టు యా క్సెస్‌ ఇన్ఫర్మేషన)పేరిట సెంట్రల్‌ వెబ్‌ పో ర్టల్‌ను 2023 ఆగస్టులో ప్రారంభించింది. దీని ద్వారా రిజిస్టర్‌ వినియోగదారులు అన్ని బ్యాం కుల్లోని అన క్లెయిమ్డ్‌ డిపాజిట్ల సమాచారం పొందేలా వివరాలు ఉంచింది.ఎవరికైనా అనుమానం ఉంటే రిజి స్టర్‌ అయి చెక్‌ చేసు కోవచ్చని సమాచారం. లేదంటే బ్యాంకులకు వెళ్లి వివరాలు కోరినా చెప్పే అవకాశం ఉంది.

Updated Date - Jul 30 , 2025 | 12:37 AM