ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంఎల్‌సీ పాయింట్‌ ఏర్పాటును నిలుపుదల చేయండి

ABN, Publish Date - May 12 , 2025 | 12:41 AM

నగరం సివిల్‌ సప్లయి గోదాము నుంచి మరో ఎంఎల్‌సీ పాయింట్‌(సఖినేటిపల్లి)ఏర్పాటును నిలుపుదల చేసి, జీవనోపాధిని మెరుగుపరచాలని కోరుతూ పి.గన్నవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఆదివారం నగరం సివిల్‌సప్లయి వర్కర్స్‌ వినతి పత్రం అందించారు.

పి.గన్నవరం, మే 11(ఆంధ్రజ్యోతి): నగరం సివిల్‌ సప్లయి గోదాము నుంచి మరో ఎంఎల్‌సీ పాయింట్‌(సఖినేటిపల్లి)ఏర్పాటును నిలుపుదల చేసి, జీవనోపాధిని మెరుగుపరచాలని కోరుతూ పి.గన్నవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఆదివారం నగరం సివిల్‌సప్లయి వర్కర్స్‌ వినతి పత్రం అందించారు. నగరం ఏఎంసీ గోదాము ఎంఎల్‌సీ పాయింట్‌లో 20మంది కూలీలు 25ఏళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. పి.గన్న వరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలకు సంబంధించిన ని త్యావసరాల ఎగుమతులు, దిగుమతులు చేస్తు న్నామన్నారు. సఖినేటిపల్లిలో మరో ఎంఎల్‌సీ పాయింట్‌ ఏర్పాటుచేస్తే సఖినేటిపల్లి, మలికి పురం, రాజోలు మండలాలు ఆ పాయింట్‌లోకి వెళ్లిపోతాయని మంత్రికి వివరించారు. మామిడి కుదురు, పి.గన్నవరం మండలాలు మాత్రమే మిగిలి ఉంటాయని, ఎగుమతులు, దిగుమతు లు తగ్గిపోవడంతో కూలీలకు జీవనోపాధి కష్టంగా ఉంటుందన్నారు. ఈవిషయాన్ని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మట్టపర్తి సూర్యచంద్ర భాస్కరరావు, పెచ్చెట్టి శ్రీనివాసరావు, కడలి సత్యప్రసాద్‌, వారణాసి శ్రీనివాసరావు, కడలి కనక రాజు, చప్పిడి రాంబాబు, పితాని రమణ, ముషిణి వెంకటేష్‌, సత్తిబాబు ఉన్నారు.

Updated Date - May 12 , 2025 | 12:41 AM