రాజమహేంద్రవరం అభివృద్ధి చేసింది నేనే!
ABN, Publish Date - May 26 , 2025 | 12:56 AM
రాజమహేంద్రవరం చరిత్రలో బుచ్చయ్యచౌదరి మమేకమై ఉన్నాడని రూరల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
గత పుష్కరాలకు ఎవరున్నారు..
తెలుగు వర్శిటీకి పాటుపడ్డా
చంద్రబాబు, పవన్‌ను కోరా
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్, మే 25 (ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవరం చరిత్రలో బుచ్చయ్యచౌదరి మమేకమై ఉన్నాడని రూరల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నాడు ఎన్‌టీఆర్ తెలుగు వర్శిటీకి తన స్వహస్తాలతో శంకు స్థాపన చేసి అప్పట్లో 190 ఎకరాలతో ఉన్న భూమిలో కొంత భాగాన్ని కేటాయించారన్నారు. ఇందులోనే ప్రస్తుతం నాక్ భవనం, పాలిటెక్నిక్ కళాశాల,కలెక్టరేట్ తదితర సముదాయాలు ఉన్నాయన్నారు. తెలుగు వర్శిటీకి కేటాయించిన దానిని అప్పట్లో అభివృద్ధి చేశారని..దీనికి చరిత్ర ఉందన్నారు.ఇది తెలియని వారు కొత్తకొత్తగా తామేదో ఉద్దరించినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.గత పుష్కరాలు.. అంతకు ముం దు పుష్కరాలకు నగరంలో రహదారులు విస్తరించి అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు రహదారులు విస్తరించే దమ్ము వీరికి ఉందా అని ప్రశ్నించారు.ఆక్రమణల తొలగింపు పేరుతో పేదోళ్లపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు.గోదావరి బండ్ రోడ్డులో గౌతమి నందన వనం, పీవీ.నరసింహరావు పార్కు, ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. సెంట్రల్ లైటింగ్ తెచ్చామన్నారు. కందుకూరి వీరేశలిం గం పంతులు గారి విగ్రహం పగిలిపోతే ఎవ్వ రు పట్టించుకోలేదని తానే కట్టించానన్నారు. ఆటోనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ,ఈఎస్‌ఐ ఆసుపత్రికి తానే కృషి చేశానన్నారు.చరిత్ర తెలియని వారు ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజ మెత్తారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పా టు చేయాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంత్రి లోకేశ్ లను కోరానన్నారు.తెలుగు వర్శిటీ ఏర్పాటు విషయం తొలుత మంత్రి కందుల దుర్గేష్ నోటీస్‌కు వచ్చి ఉంటుందన్నారు. ఆయన కూడా సపోర్ట్ చేశారన్నారు.ఇదేదో ఒక్కరే సాధించినట్టు చెప్పు కోవడం సరికాదన్నారు.అలా చెప్పాల్సి వస్తే సుబ్రహ్మణ్య మైదానంలో సభ పెట్టి మాట్లాడాల్సి వస్తుందని..అప్పుడు ఎవరు ఏమి చేశారో తేలుతుందన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి టీడీపీని పటిష్టం చేశార న్నారు. కడపలో జరిగే మహానాడుకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపా రు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ రూరల్ అధ్య క్షుడు మత్చ్సేటి శివసత్యప్రసాద్, టూరిజం డవప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:56 AM