ఐదేళ్ల అరాచక వైసీపీ పాలనకు ఓటుతో రాష్ట్రానికి విముక్తి
ABN, Publish Date - Jul 27 , 2025 | 01:39 AM
సీఎం చంద్రబాబునాయుడు సారథ్యంలోని రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా సం క్షేమం, అభివృద్ధి ఆగలేదని రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యాపుల కేశవ్ అన్నారు.
రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటాం : ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్
రాయవరం,జూలై26(ఆంరఽధజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు సారథ్యంలోని రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా సం క్షేమం, అభివృద్ధి ఆగలేదని రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యాపుల కేశవ్ అన్నారు. రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో శనివారం జరిగిన పలు అభివృద్ధి పఽథకాలను స్థా నిక ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు సారఽథ్యంలో మంత్రి ప్రారంభించారు. తొలుత గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామం లో రూ.69 లక్షలతో నిర్మించే మహిళా స్త్రీశక్తిభవన నిర్మాణం, రూ.90 లక్షలతో నిర్మించే 5రహదారుల పనులు, రూ.86.40లక్షలతో చే పట్టిన జల్‌జీవన్‌మిషన్ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక కల్యాణ మండపంలో జరిగిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడలేనివిధంగా ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత నాటి సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని కాపాడారని ఆయన అన్నారు. కూటమికి ఓటువేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చి న తర్వాత రాష్ట్ర అభివృద్ధి, మహిళల సంక్షేమం కోసం ఇంటిని చక్కదిద్ద్దే మహిళలాగా నిత్యం ఆలోచిస్తూ ఏవిధంగా రాష్ట్రాభివృద్ధి సాధించాలన్న తపనతో ఉన్నారన్నారు. రాష్ట్రం ఖజానా ఖాళీ అయిందని, అయితే సంక్షేమ పఽథకాలు ఆగకుండా కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో పఽథకాలు అమలుచేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న సాయం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో కూటమికి వెన్నుదన్నుగా ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూడా అభివృద్ధి విషయంలో సహకరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వేగుళ్లమాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన నిధులు మంజురు చేయాలని మంత్రిని కోరారు. ఏపీఐడీసీ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణమాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైందని, కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, నల్లమిల్లి వీర్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, కార్పొరేషన్ డైరెక్టర్‌లు జయబాబు, దొరబాబు, గడిసత్యవతి రాంబాబు, చెల్లురుగ్రామ సర్పంచ్ పాలిక రాఘవ పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 01:39 AM