మద్యం కేసులో నిందితులు ఎంత పెద్దవారైనా చట్టం వదిలిపెట్టదు
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:49 AM
రావులపాలెం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో మిఽథున్‌రెడ్డిని అరెస్టు చేస్తే వైసీసీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. మద్యం కేసులో నిందితులు ఎంత పెద్దవారైనా చట్టం వదలిపెట్టదు. చట్టం అం దరికీ సమానమేనని ఆర్‌అండ్‌బీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ప్రతిపక్ష హోదా కూడా లభించని నాయకుడా విమర్శించేది
మంత్రి జనార్ధనరెడ్డి
రావులపాలెం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో మిఽథున్‌రెడ్డిని అరెస్టు చేస్తే వైసీసీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. మద్యం కేసులో నిందితులు ఎంత పెద్దవారైనా చట్టం వదలిపెట్టదు. చట్టం అం దరికీ సమానమేనని ఆర్‌అండ్‌బీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. రూ.4వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నాయకులు జైలులో మగ్గుతున్నారన్నారు. మద్యం కేసులో సిట్ దర్యాప్తు జరుగుతున్న కారణంగా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నారు. దేశ చరిత్రలోనే ప్రతిపక్ష హోదా కూడా లభించని నాయకుడికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరిపించి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతామంటున్నారని, గత ఐదేళ్ల పాలనలో వారు చేసిన అరాచకా లు, అక్రమాలను ప్రజల కు చెప్పుకోవడానికా అని ప్రశ్నించారు. ప్రజ లు ఛీ కొట్టినా ఇంకా తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో వైసీపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వైసీపీ పాలనలో ఇసుక దోపి డీ చేసి ఆ సొమ్మును తాడేపల్లి ప్యాలస్‌కు తరలించలేదా అని ప్రశ్నించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బం దులు ఉన్నా ఒక్క గోపాలపురంలోనే రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ పరదాల చాటున దాక్కుని తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుని బటన్లు నొక్కే పాలన కాదని, నిరంతరం ప్రజాసమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధికి సంక్షేమానికి బాటలు వేస్తూ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు అయినవిల్లి సత్తిబాబుగౌడ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:49 AM