రామాలయం కల్యాణవేదికను తొలగించకండి
ABN, Publish Date - May 18 , 2025 | 01:16 AM
వైన తేయ గోదావరి నదీ తీరాన ఉన్న శ్రీపట్టాభి రామస్వామి రామాలయం ఎదుట యాగశాల ఏర్పాటును అడ్డుకోవద్దని ఎమ్మెల్యే గిడ్డి సత్యనా రాయణను కృష్ణధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య అధ్యక్షుడు కేడీఆర్ (కె.దుర్గారావు) కోరారు.
పి.గన్నవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): వైన తేయ గోదావరి నదీ తీరాన ఉన్న శ్రీపట్టాభి రామస్వామి రామాలయం ఎదుట యాగశాల ఏర్పాటును అడ్డుకోవద్దని ఎమ్మెల్యే గిడ్డి సత్యనా రాయణను కృష్ణధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య అధ్యక్షుడు కేడీఆర్ (కె.దుర్గారావు) కోరారు. ఆలయ సేవకురాలు పేరిచర్ల సత్య వాణి, స్థానిక మహిళలతో కలిసి శనివారం ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిం చారు. ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి క ల్యాణవేదిక, యాగశాల శాశ్వత నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నక్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు అనుసరించి తహశీల్దార్, ఎంపీడీవోలు స్థల పరిశీలన చేశారని, పి.గన్నవ రంలో స్థలం లేక ఆ స్థలాన్ని సూచించామని అధికారులు చెప్పారని, అప్పటికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించామని ఎమ్మెల్యే వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు కానీ, ఆల యానికి సంబంధించిన వారు ఏవిధమైన సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వం దృష్టికి మీసమస్యను తీసుకువెళ్లి పరి ష్కరిస్తానని హిందు సంఘాలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.వినతిపత్రం అందించిన వారిలో కృష్ణధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ దాసు రాజు, రామసేతు బృందంలలిత్‌కుమార్, ఎం.ప రందామయ్య, పి.సీతారామయ్య, గురుడవేగ టీమ్, రామసేతు టీమ్, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిం దూ పరిషత్ సభ్యులు, సమరసత సేవా ఫౌం డేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 01:16 AM