ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మల్లాం సమస్యను శాంతియుతంగా పరిష్కరించాం

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:46 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో సాంఘిక బహిష్కరణ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించామని కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తెలిపారు. ఈ సమస్యకు సంబంధించిన పూర్వపరాలను పరిశీలించి సాంకేతికంగా పరిష్కరించే నిమిత్తం కాకినాడ ఆర్డీవో, పిఠాపురం తహశీల్దార్‌, సీఐ, ఏఎస్‌డబ్ల్యూవో ఆధ్వర్యంలో ఇరువర్గాలతో శాంతి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక వర్గం నుం చి దుర్గాడ సత్తిబాబు, కా

మల్లాంలో జరిగిన శాంతికమిటీ సమావేశంలో మాట్లాడుతున్న వికాస పీడీ లచ్చారావు

కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌

పిఠాపురం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో సాంఘిక బహిష్కరణ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించామని కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తెలిపారు. ఈ సమస్యకు సంబంధించిన పూర్వపరాలను పరిశీలించి సాంకేతికంగా పరిష్కరించే నిమిత్తం కాకినాడ ఆర్డీవో, పిఠాపురం తహశీల్దార్‌, సీఐ, ఏఎస్‌డబ్ల్యూవో ఆధ్వర్యంలో ఇరువర్గాలతో శాంతి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక వర్గం నుం చి దుర్గాడ సత్తిబాబు, కాలదారి రాంబాబు, ఎ ద్దు సుబ్రహ్మణ్యం, అంగులూరి నూకరాజు, కడి తి కృష్ణారావు, దాట్ల సూరిబాబు... మరోవర్గం నుంచి కుంపట్ల చెల్లారావు, మలిరెడ్డి రామచంద్రరావు, రంగనాథం అప్పన్న, కొప్పన వీర్రాజు, కొండపల్లి కొండారావు, బుర్రా వీరేష్‌బాబు శాంతి కమిటీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఒక వర్గంపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటు ందని సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇరువర్గాల్లో ఎవరైనా సోషల్‌ మీడి యా ద్వారా తప్పుడు ప్రచారం, ప్రకటనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సం ఘటనలు జరగకుండా ఏమైనా వివాదాలు జరిగితే కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలని స భ్యులు అంగీకారానికివచ్చారని కలెక్టర్‌ చెప్పారు.

విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు

మల్లాం గ్రామంలో రెండు వర్గాల మద్య జరిగిన సంఘటనలకు సంబంధించి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాద్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ లచ్చారావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ ఆదేశాలతో సోమవారం రాత్రి మల్లాం గ్రామ సచివాలయంలో ఇరువర్గాలకు చెందిన శాంతికమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎటు వంటి సమస్యలు తలెత్తకుండా శాంతికమిటీ సభ్యులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. యువతకు విద్య, ఉద్యోగావకాశాలు, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతపై ఇకపై ప్రతి ఆది వారం అవగాహన సదస్సులు నిర్వహించనున్న ట్టు చెప్పారు. శాంతికమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రూరల్‌ ఎస్‌ఐ జానీబాషా పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:46 AM