ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీధి సుబ్రహ్మణ్యం హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం

ABN, Publish Date - Jul 24 , 2025 | 12:51 AM

కాకినాడ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన ఘటన వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని, సిట్‌ విచారణలో త్వరలోనే అసలు విషయాలు బయటపడతాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతి నిధి సరిపల్లి (మహాసేన) రాజేష్‌ పేర్కొన్నారు. కా

కాకినాడలో మాట్లాడుతున్న రాజేష్‌

త్వరలోనే అసలు విషయాలు బయటకు : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్లి రాజేష్‌

కాకినాడ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన ఘటన వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని, సిట్‌ విచారణలో త్వరలోనే అసలు విషయాలు బయటపడతాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతి నిధి సరిపల్లి (మహాసేన) రాజేష్‌ పేర్కొన్నారు. కాకినాడలో టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధ వారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టిందన్నా రు. ఈ విషయాన్ని రాజమండ్రిలో జరిగిన మ హానాడు సభలో చంద్రబాబునాయుడు దృష్టికి దళిత నాయకులతో కలిసి తీసుకెళ్లామని, అధి కారంలోకి రాగానే ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరామన్నారు. దీంతో సుబ్రహ్మ ణ్యం హత్య కేసులో వాస్తవాలను వెలుగు తీసేందుకు కూటమి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ హత్య జరిగి నప్పుడు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టలే దన్నారు. హత్య జరిగిన సమయంలో జరిగిన ఘటనలు సెల్‌ఫోన్‌ టవర్లు, సీసీ కెమెరాల పుటేజ్‌ల ద్వారా త్వరలోనే బయటకు వస్తా యన్నారు. ఈ హత్య ఎమ్మెల్సీ అనంతబాబు ఒ క్కరి వల్ల జరిగింది కాదని, దీని వెనుక కాకినాడ, రాజానగరం వైసీపీ నాయకుల అండదండలు ఉ న్నాయన్నారు. సుబ్రహ్మణ్యం దగ్గర వైసీపీ నాయకుల అక్రమాలకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, అవన్నీ బయట పడ తాయనే హత్య చేశారని ఆయన ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొల్లాబత్తుల అప్పారావు, మాజీ కార్పొరేటర్‌ పలివెల రవి అనంతకుమార్‌, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:51 AM