మహా..సందడి
ABN, Publish Date - May 26 , 2025 | 12:54 AM
పసుపు పండుగకు జనం సన్నద్ధమయ్యా రు.. తండోపతండాలుగా నాయకులు.. కార్యకర్త లు తరలివెళ్లేలా నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కడపలో ఈ నెల 27,28,29 తేదీ ల్లో టీడీపీ మహానాడు పండుగ నిర్వహించ నున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి సన్నద్ధం
నేడు కడపకు టీడీపీ నేతల క్యూ
కార్యకర్తలు,అభిమానుల సమీకరణ
నియోజకవర్గాల వారీ ఏర్పాట్లు
బస్‌లు, కార్లలో తరలింపు
ప్రత్యేకంగా విందు భోజనం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
పసుపు పండుగకు జనం సన్నద్ధమయ్యా రు.. తండోపతండాలుగా నాయకులు.. కార్యకర్త లు తరలివెళ్లేలా నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కడపలో ఈ నెల 27,28,29 తేదీ ల్లో టీడీపీ మహానాడు పండుగ నిర్వహించ నున్నారు. ఆ పండుగలో భాగస్వామ్యం కావ డానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పసుపు దండు కదలనుంది. సోమవారం ఉద యం అన్ని నియోజకవర్గాల నుంచి ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల నాయకత్వంలో వేలాదిగా తరలివెళ్లనున్నారు. ఎన్నికల ముందు రాజమహేంద్రవరంలో మ హానాడుతో పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్స వాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికా రంలోకి వచ్చిన తర్వాత మొదటగా జరగబో యే ఈ మహానాడు కడపలో బ్రహ్మాండంగా నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు అడ్డాగా ఉన్న కడపలో టీడీపీ గత ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించిన సంగతి తెలి సిందే.ఇవాళ మహానాడు ఘనంగా నిర్వహిం చడం ద్వారా అక్కడ తమ సత్తా ఏంటో చూ పాలనేది టీడీపీ వ్యూహంగా కనిపి స్తోంది. మహానాడు నిర్వహణకు 19 కమిటీలు నియ మించిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్య మైన తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామ కృష్ణుడు వ్యవహరించడంతో పాటు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కమిటీ కన్వీనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.పలు కమిటీల్లో మన ప్రాంత నేతలు కొందరు నేతలు సభ్యులుగా నియ మితులయ్యారు. కార్యకర్తలకు కొంతమందికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు దక్కాయి. వందలాది పోస్టులు రానున్నాయి. ఈ నేప థ్యంలో మహానాడులో పాల్గొనడానికి టీడీపీ శ్రేణులు బాగా ఉత్సాహ పడుతున్నాయి.గత వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడిన ఆనందంతో క్యాడర్ ఉత్సాహంగా ఉంది. ఇప్ప టికే ప్రతి నియోజకవర్గంలోనూ మహానాడు సన్నాహక సభలు పెట్టుకోవడంతో పాటు జిల్లాల మినీ మహానాడు ఘనంగా నిర్వహి ంచిన సంగతి తెలిసిందే. అందరిలోనూ జోష్ పెరిగింది.రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మహానాడులో కచ్చితంగా పాల్గొనాలనే ఆలోచనతో అమెరికా టూర్‌ను మధ్యలోనే ఆపుకుని రావడం గమ నార్హం. సోమవారం ఉదయం అన్ని నియోజ కవర్గాల నుంచి టీడీనీ పసుపుదండు ఛలో మహానాడు అంటూ బయలుదేరనుంది.
కడప 950 కి.మీ
ఈ మేరకు నాయకులు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి కడపకు 950 కిలోమీటర్లు.. కాకినాడ, కోనసీమ నుంచి వెయ్యి కిలోమీటర్లు దాటి ఉంటుంది.రోడ్డు మార్గాన వెళ్లాలంటే 9 గంటలు పైనే పడుతుంది. ఈ నేపథ్యంలో ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్.. రాత్రికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 27వ తేదీన ఉదయం నుంచే మహానాడు కార్యక్రమం ఆరంభిస్తారు. ఆ సమయానికి అక్కడకు చేరుకునేలా ప్రణాళిక రచిస్తు న్నారు.. నియోజకవర్గాల వారీ తరలివెళ్లేలా చూస్తున్నారు. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఏర్పాట్లు చేశారు.
Updated Date - May 26 , 2025 | 12:54 AM