ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లక్కీ డ్రా పేరిట రూ.లక్షల్లో వసూళ్లు

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:20 AM

ఎటపాక, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఎప్పటి నుంచో కొనసాగుతున్న లక్కీ డ్రా స్కీమ్‌ ఇది... మా వద్ద లక్కీ స్కీమ్‌లో సభ్యులుగా ఉంటే ఎం తో ప్రయోజనం ఉంటుంది. అదృష్టం వరిస్తే వి లువైన వస్తువులు పొందవచ్చు. స్కీమ్‌లో పెట్టిన సొమ్ములకు గ్యారెంటీ ఉంటుంది. వారానికి ఒక్క సారి డ్రా తీస్తాం.... డ్రా తగిలితే అదృష్టం మీదే... 32 వారాల్లో చివరి వరకు మీకు డ్రా తగలకుంటే కట్టిన సొమ్ములతో 4 తులాల వెండి పట్టీలు ఇ స్తాం అంటూ ఏజెన్సీలో ఇటీవల లక్కీ

లక్కీ డ్రా పేరుతో ముద్రించిన పత్రం

32 వారాలు కట్టండి... డ్రా తగలకుంటే వెండి పట్టీలు

ఏజెన్సీలో గిరిజనులకు టోకరా వేస్తున్న కేటుగాళ్లు

వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చి

అంటగడుతున్న వస్తువులు

మోసపోతున్న ప్రజలు, చోద్యం చూస్తున్న అధికారులు

ఎటపాక, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఎప్పటి నుంచో కొనసాగుతున్న లక్కీ డ్రా స్కీమ్‌ ఇది... మా వద్ద లక్కీ స్కీమ్‌లో సభ్యులుగా ఉంటే ఎం తో ప్రయోజనం ఉంటుంది. అదృష్టం వరిస్తే వి లువైన వస్తువులు పొందవచ్చు. స్కీమ్‌లో పెట్టిన సొమ్ములకు గ్యారెంటీ ఉంటుంది. వారానికి ఒక్క సారి డ్రా తీస్తాం.... డ్రా తగిలితే అదృష్టం మీదే... 32 వారాల్లో చివరి వరకు మీకు డ్రా తగలకుంటే కట్టిన సొమ్ములతో 4 తులాల వెండి పట్టీలు ఇ స్తాం అంటూ ఏజెన్సీలో ఇటీవల లక్కీ డ్రా పేరు తో కొందరు గిరిజనులను బురిడీ కొట్టించేందుకు వారి నుంచి వారానికి ఒక్కసారి డ్రా పేరుతో వ సూళ్లకు పాల్పడుతున్నారు. గిరిజన గ్రామాలే లక్ష్యంగా చేసుకుని కొందరు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ఎటపాక మండలంలోని అయ్యవారి పేట, కాపవరం, పంగొమ్ముకొయగూడెం, సీతాపు రం, ఎర్రబోరు తదితర గిరిజన గ్రామాలతోపాటు పోలవరం విలీన మండలైన వీఆర్‌పురం, ఏలూ రి జిల్లాలోని కుక్కునూరు, తదితర ప్రాంతాలకు చెందిన వారి నుంచి లక్కీ డ్రా పేరుతో వసూళ్లు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు సభ్యుల కోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, అందులో స్కీమ్‌ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తు న్నారు. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన కొ ందరు వ్యక్తులు లక్కీ డ్రా పేరుతో గిరిజన గ్రా మాల్లో తిష్ట వేస్తూ గిరిజనుల అమాయకత్వాని అసరాగా చేసుకుని రూ.లక్షల్లో వసూళ్లకు పాల్ప డుతున్నారు. లక్కీ స్కీమ్‌ పేరుతో ఇప్పటికే గిరిజనుల నుంచి అధిక మొత్తంలో కట్టించారు.

వారానికి రూ.200 చొప్పున..

ఇటీవల ఎటపాక ఏజెన్సీలో కొందరు లక్కీ డ్రా పేరుతో ముద్రించిన పత్రాలతో ఊరూరు తిరు గుతూ పంచుతున్నారు. తర్వాత లక్కీ స్కీమ్‌లో సభ్యులుగా చేరాలని, రూ.200 వందలకే లక్కీ డ్రాలో విలువైన వస్తువులు మీ సొంతం అవుతా యని ఊదరగొడుతున్నారు. దాంతో అమాయక గిరిజనులు నిజమే అని నమ్ముతున్నారు. దీంతో వారానికి రూ.200 చొప్పున సొమ్ములు కడు తున్నారు. అయితే మొత్తం స్కీమ్‌ గడువు 32 వారాలు ఉంటుందని, అందులో 600 మందిని స భ్యులుగా చేర్చుకున్నారు. ఇందులో అత్యధికులు గిరిజనులే. ఇప్పటికే ఎటపాకలోని గ్రామాల్లో లక్కీ డ్రా పేరుతో రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. పేరుకు డ్రా తీసి రూ.300 నుంచి రూ.500 విలువైన వస్తువులు డ్రా తగిలాయం టూ అంటకడుతున్నారు. 32 వారాల పాటు త ప్పకుండా సొమ్ములు కట్టాలని మధ్యలో ఆపేస్తే తిరిగి డబ్బులు ఇవ్వమని చెబుతున్నారు. 32 వారాల్లో డ్రా తగలకుంటే ఆ సభ్యుడికి 4తులాల వెండిపట్టీలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు.

గతంలో ఇదే తరహాలో...

రెండేళ్ల క్రితం ఇదే తరహాలో ఎటపాక మం డలంలోని కృష్ణవరం, భూపతిరావుపేట, కొత్తూ రు, కన్నాపురం, లక్ష్మీపురం, కుసుమనపల్లి, తది తర గ్రామాల్లో లక్కీ డ్రా పేరుతో కొందరు రూ లక్షల్లో వసూళ్లు చేసి బురిటీ కొట్టించి, చివరకు బోర్డు తిప్పేస్తారు. అప్పుడు భద్రాచలం సమీపం లోని సారపాక కేంద్రంగా నిర్వహణ సాగిస్తు న్నామని, ఆఫీస్‌ కూడా అక్కడ ఉందని నమ్మబలికించారు. ఇదే మాదిరిగా ముందు వా రాల్లో డ్రా తగిలాయంటూ తక్కువ రకం వస్తు వులు గిరిజనులకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. నమ్మిన గిరిజనులు ఆ తర్వాత సొమ్ములుతా క ట్టారు. రూ.లక్షలో వసూళ్లు చేసిన తర్వాత నిర్వా హకులు బోర్టు తిప్పేసి పరారయ్యారు. దాంతో సొమ్ములు చెల్లించిన గిరిజనులు లబోదిబోమ న్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ఇలాంటి వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడు తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:20 AM