‘లోవ’ ఆదాయం రూ.67.57 లక్షలు
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:34 AM
తునిరూరల్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో హుండీల ఆదాయం గ ణనీయంగా పెరిగింది. ఆషాఢ మా
లోవ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది
తునిరూరల్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో హుండీల ఆదాయం గ ణనీయంగా పెరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. ఆలయ ఉన్నతాధికారుల సమక్షంలో చేపట్టిన లెక్కింపులో 33 రోజులకు రూ.67,57,459 ఆదాయం సమకూరినట్లు ఈవో విశ్వనాధరాజు తెలిపారు. గతేడాది కంటే ఈసారి రూ.26.62 లక్షలు అధికంగా సమకూరి ందన్నారు. భక్తుల అవసరాలకనుగుణంగా ఆల యంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 12:34 AM