ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థలాలకు ఎన్‌వోసీలు ఇప్పించండి

ABN, Publish Date - May 20 , 2025 | 01:03 AM

రాజమహేంద్రవరం భాస్కర్‌నగర్‌కు చెందిన లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసిన కొందరు వాటికి ఎన్‌వోసీలు ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌కు అర్జిపెట్టుకున్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో స్థల యజమానులు బి.జార్జిఆంటోని, పచ్చిపాల పుత్రయ్య కమిషనర్‌ను కలిశారు.

వృద్ధురాలి నుంచి అర్జీ స్వీకరిస్తున్న కమిషనర్‌ కేతన్‌గార్గ్‌
  • పీజీఆర్‌ఎస్‌లో కమిషనర్‌కు అర్జీ పెట్టుకున్న బాధితులు

  • అర్జీలను గడువు లోపు పరిష్కరించండి: కమిషనర్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 19(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం భాస్కర్‌నగర్‌కు చెందిన లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసిన కొందరు వాటికి ఎన్‌వోసీలు ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌కు అర్జిపెట్టుకున్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో స్థల యజమానులు బి.జార్జిఆంటోని, పచ్చిపాల పుత్రయ్య కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆంటోని మాట్లాడుతూ తాను ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగినని, పదవి విరమణ సమయంలో వచ్చిన సొమ్ముతో భాస్కర్‌నగర్‌లో సర్వేనెంబరు 121/1లో 112 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానన్నారు. దాంట్లో గృహ నిర్మాణం కోసం లిక్విడేటర్‌ ద్వారాడివిజనల్‌ కోఆపరేటివ్‌ ఆఫీసరుకు అర్జీ పెట్టగా దీనిపై సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి సమాచారం అందవలసివుందని చెప్పి మమ్మల్ని కూడా వార్కి అర్జీ పెట్టమని చెప్పారు. ఈసీ కోరగా దాని రికార్డు బ్రిటిల్‌ అయిపోయిందని ఇచ్చారన్నారు. ఈ విషయంలో లిక్విడేటర్‌ను సంప్రదించగా తమ నెంబరుతో వేరే అనధికార నెంబరు 2207తో లింక్‌ అయ్యి ఉందని అని చెప్పి దీనిపై చర్య తీసుకోకుండా మమ్ములనే వేదనకు గురిచేసి హైకోర్టుకి వెళ్ళమని సలహా ఇస్తున్నారన్నారు. తనకు ఎన్‌వోసీ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అదే లేఅవుట్‌కు చెందిన పచ్చిపాల పుత్రయ్య కూడా కమిషనర్‌కు అర్జీ పెట్టుకున్నారు. భాస్కర్‌నగర్‌లో దొంగలు కొందరు చేసిన పనికి కష్టపడి కొనుగోలు చేసిన తమ భూములకు ఎన్‌వోసీలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • పీజీఆర్‌ఎస్‌కు 27 అర్జీలు

కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ప్రజల నుంచి 27 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 3 అర్జీలు, టౌన్‌ ప్లానింగ్‌కు 5, ఇంజనీరింగ్‌ శాఖకు 9, వార్డు సచివాయాలకు 8, పబ్లిక్‌ హెల్త్‌కు 1, మెప్మాకు 1 అర్జీ పింఛన్లు, కుళాయి కనెక్షన్లు, విద్యుత్‌ పోల్స్‌ ఏర్పాటు, డోర్‌ నెంబర్ల మార్పు తదితర సమస్యలపై వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడు తూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన అర్జీలు గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి పారదర్శకంగా విచారణ జరిపి అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ తప్పనిసరి

రాష్ట్ర ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రతి పౌరుడు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ తప్పని సరిగా చేయించుకోవాలని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. సంక్షేమ పథకాల కోసమే కాకుండా ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిటీ మెంబరు సర్టిఫికెట్‌, ట్యాక్స్‌ పేమెంట్‌, ల్యాండ్‌ రిజిస్ట్రేషన్లు వంటి ఎటువంటి సేవలు పొందాలన్నా హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ తప్పనిసరి అని అన్నారు. తెల్ల రేషన్‌కార్డుదారులతో పాటు ఇతర కార్డుదారులు, ఆర్థికంగా ఉన్నత వర్గాల వారు మ్యాపింగ్‌ చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ సేవల లబ్ధిని కోల్పోకుండా ఉండేందు కు తమ తమ పరిధిలోని సచివాలయ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.

  • 1100కు కాల్‌ చేయండి: ఆర్డీవో

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): సమస్యలు ఉండి కార్యాలయనికి నేరుగా రాలేని ప్రజలు 1100 కాల్‌ సెంటర్‌ ఫోన్‌ చేసి అర్జీలు, ఫిర్యాదులు తెలపవచ్చని ఆర్డీవో ఆర్‌.కృష్ణనాయక్‌ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వచ్చిన అర్జీలను డివిజన్‌ స్థాయి అధికారులతో కలసి ఆయన తీసుకున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం , సీతానగరం మండలాలకు చెందిన పలువురు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను పూర్తిగా పరిశీలించి అర్జీదారులకు పూర్తి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. పలువురు డివిజనల్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 01:03 AM