ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేవస్థానం భూముల సర్వే పది రోజుల్లో పూర్తి

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:52 AM

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ భూముల శిస్తుపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఆర్డీవో కె.మాధవి, దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అంతర్వేది, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ భూముల శిస్తుపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఆర్డీవో కె.మాధవి, దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే పూర్తిస్థాయిలో రైతులు ముందుకురాకపోవడంతో సమావేశాన్ని వెంటనే వాయిదా వేశారు. పూర్తిస్థాయిలో దేవ స్థానం భూములు సర్వే నిర్వహించిన తరువాత రైతులతో మాట్లాడతామని ఆర్డీవో కె.మాధవి తెలిపారు. తొలుత స్వామివారిని దర్శించుకున్ని ఆర్డీవో మాధవి అనంతరం తక్కువ సంఖ్యలో వచ్చిన రైతులతో మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామివారికి 726ఎకరాలు భూములు ఉండగా వాటిలో వరి, సర్వే, చెరువులు, ఇళ్లు ఉన్నప్పటికీ వాటి శిస్తును పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నా రైతులు మాత్రం స్పందించడం లేదన్నారు. స్వామివారి భూములపై పది రోజుల్లో పూర్తిస్థాయి సర్వే నిర్వహించి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ సమక్షంలో రైతులతో మాట్లాడి శిస్తు వసూలు, పెంచే విధానంపై చర్చిస్తామని తెలిపారు. స్వామివారి భూములు అన్యాక్రాంతం, ఆక్రమణలు జరిగిన కొన్నింటిలో చర్చిల నిర్మాణం కూడా జరిగిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాసనగేష్‌ ఆర్డీవో మాధవికి తెలిపారు. దీనిపై ఆర్డీవో స్పందిస్తూ స్వామివారికి ఎక్కడ భూమి ఉన్నా పూర్తిస్థాయిలో సర్వే చేయించి స్వామివారికి చెందేలా ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. అనంతరం పలువురు రైతులు స్వామివారి భూముల శిస్తుపై ఆర్డీవో మాధవికి వినతిపత్రాలు అందించారు. ఏసీ వి.సత్యనారాయణ, తహశీల్దార్‌ ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కర్‌, ఆర్‌ఐ రామరాజు, ఎంపీటీసీ బైరా నాగరాజు, కొల్లాబత్తుల నాని, మాలే శ్రీనివాసనగేష్‌, పోతురాజు సురేష్‌, ఉండపల్లి అంజి, తాడి నీలకంఠం, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:52 AM