భూ... బాట
ABN, Publish Date - Jul 01 , 2025 | 01:36 AM
గత వైసీపీ సర్కారు భూముల రీసర్వే నిర్వాకంతో నానా యాతనలు పడుతున్న అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చింది. అడ్డగోలు సర్వేతో సింగిల్ ఎల్ పీఎంలకు బదులు జాయింట్ ఎల్‌పీఎంల చిక్కులతో నరకయాతనకు గురవుతున్న వారికి న్యాయం చేసేందుకు నడుం బిగించింది. జాయింట్ ఎ
ఎల్‌పీఎం చిక్కు..తొలగేనా ముప్పు
గత వైసీపీలో రీసర్వేలో తప్పులు
జాయింట్ ఎల్‌పీఎంలతో చిక్కులు
23 వేల జాయింట్ ఎల్‌పీఎంలు
56 వేల మంది రైతుల ఇక్కట్లు
పథకాలు అందక విలవిల
కూటమి ప్రభుత్వం చొరవ
కదిలిన అధికార యంత్రాంగం
నేటి నుంచి క్షేత్రస్థాయిలో సర్వే
సింగిల్ ఎల్‌పీఎంలపై కసరత్తు
ఉమ్మడి జిల్లాలో రైతులకు నోటీసులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ సర్కారు భూముల రీసర్వే నిర్వాకంతో నానా యాతనలు పడుతున్న అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చింది. అడ్డగోలు సర్వేతో సింగిల్ ఎల్ పీఎంలకు బదులు జాయింట్ ఎల్‌పీఎంల చిక్కులతో నరకయాతనకు గురవుతున్న వారికి న్యాయం చేసేందుకు నడుం బిగించింది. జాయింట్ ఎల్‌పీఎంల స్థానంలో సింగిల్ ఎల్‌పీఎంలు కేటాయించేందుకు నిర్ణ యించింది. జగన్ సర్కారు అస్తవ్యస్త విధానం ఫలితంగా పథకాలకు దూరమైన వేలాది రైతులకు త్వరలో మోక్షం కలిగే అవ కాశం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 23 వేల జాయింట్ ఎల్‌పీఎంల పరిధిలో 68 వేల ఎకరాలు ఉన్నాయి. దీంతో 56 వేలమంది రైతులు ఏ పథకం అం దడంలేదు. క్షేత్రస్థాయిలో జాయింట్ ఎల్‌పీఎంలను సిం గిల్ ఎల్‌పీఎంలుగా మార్చేందుకు చిక్కులెదురవుతుం డడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం నుంచి సర్వే చేపట్టాల్సి ఉండడంతో అందుబా టులో ఉన్న రైతులపై దృష్టిసారించాలని నిర్ణయించారు.
నాడు అస్తవ్యస్తంగా..
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ,వాణిజ్య భూము లకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ శాఖ పాత సర్వే రికార్డుల ప్రకారమే లావాదేవీలు కొనసాగేవి. గత వైసీపీ సర్కారు ఈ మొత్తం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉమ్మడి జిల్లాలో 690 గ్రామాల్లో సుమారుగా ఏడు లక్షల ఎక రాలకు పైగా భూములను రీసర్వే చేసింది. అప్ప టి సీఎం జగన్ బొమ్మను సర్వేరాళ్లపై ఉంచడం కోసం ఆగమేఘాలపై రీసర్వేను మమ అనిపించేశారు. రైతులు, యజమానులు లేకుండా రీసర్వే పేరుతో ఏకంగా భూముల హద్దులు మార్చేశారు. ఒకరి భూమిని మరొకరి ఖాతాలో చేర్చేశారు. ఎకరం భూమి ఉంటే అం దులో 30 సెంట్లు పక్క రైతు ఖాతాలో జమ చేసేశారు. ఇలా ఒకటేంటి వేలాది తప్పులు చేసి రీసర్వే పేరుతో భూముల హద్దులు, హక్కులను మార్చి పారేశారు.
రైతుల నరకయాతన..
రీసర్వే ప్రక్రియలో భాగంగా ఆయా భూ యజమా నులకు ఎంత భూమి ఉందని గుర్తించారో ఆయా రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) కేటాయించాలి. ఇక్కడే అతిపెద్ద తప్పిదం జరిగింది. ఇద్దరి నుంచి నలుగురు రైతులను కలిపేసి జాయింట్ ఎల్‌పీఎం ఇచ్చేశారు. దీనివల్ల ఒక సర్వే నెంబరులో ఉన్న భూమి ముగ్గురు రైతులది అయితే ముగ్గురికి ఒకే ఎల్‌పీఎం నెంబరు కేటాయించేశారు. దీని వల్ల వేలాది మంది రైతులు నరకయాతన పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, బ్యాంకు రుణాలు ఇలా దేనికి దరఖాస్తు చేసినా అసలు భూమే లేదని కొందరికి, పరిమితికి మిం చి భూవిస్తీర్ణం ఉందనే కారణంతో మరికొందరికి అర్హుల జాబితాకు ఎక్కలేదు. తీరా అధికారుల వద్దకు తమ భూమి వివరాలతో వెళితే రెవెన్యూ వెబ్‌సైట్‌లో సదరు యజమాని భూసర్వే నెంబరుపై ఇంకో ముగ్గురు రైతులు ఉండడంతో భూహక్కు వివాదం సాకు చూపిం చారు. ఇలా అనేక మంది రైతులు ఈ విషయంలో రెండేళ్లుగా నర కయాతన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం సమ స్య పరిష్కారంపై దృష్టి సారించింది. రైతులకు మేలు చేసేలా ఆలోచన చేస్తుంది. సింగిల్ ఎల్‌పీఎం నెంబరు కేటాయించేలా సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
రీసర్వే తప్పులపై 42 వేల దరఖాస్తులు
ప్రభుత్వం మారాక నిర్వహించిన గ్రామ సభల్లో 42 వేల మంది వరకు రీసర్వే తప్పులు పరిష్కరించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో జాయి ంట్ ఎల్‌పీఎంలు జారీ అయినవి 23,327గా ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. ఈ జాయింట్ ఎల్‌పీఎంల వల్ల 56 వేల మంది రైతులు నష్టపోతున్నట్టు తేల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో 9,830 జాయింట్ ఎల్‌పీఎంలు కేటాయించి పారేశారు. దీంతో 30,999 ఎకరాలకు సంబంధించి 22 వేల మంది రైతులు ఇరుక్కుపో యారు. కోనసీమ జిల్లా పరిధిలో 9,262 జాయింట్ ఎల్‌పీఎంలు కేటాయించగా వీటి పరిధిలో 28 వేల ఎక రాలకు సంబంధించి 26 వేల మంది రైతులు, కాకినాడ జిల్లా పరిధిలో 4,235 జాయింట్ ఎల్‌పీఎంల పరిధిలో 8 వేల మంది రైతులు ఇరుక్కుపోయారు.
5 వేల మంది దరఖాస్తులు..
జాయింట్ ఎల్‌పీఎంల వల్ల వేలాది మంది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వీరి వివరాలు పరిశీలించి సిం గిల్ ఎల్‌పీఎంలు కేటాయించాలని కొంత కాలం కిందట సీఎం చంద్రబాబు ఆదేశించారు. తద్వారా వీరి ఇక్కట్లు పరిష్కరించ డం ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా మారుతారని తేల్చా రు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సర్వేశాఖ అధికారులు ఫ్లెక్సీలు, దండోరాల ద్వారా ప్రచారం చేయించారు. ఈ మేరకు రూ.500 చెల్లించాల్సి ఉండగా ఇది రైతులకు భార మని గుర్తించిన ప్రభుత్వం రూ.50 మాత్రమే వసూలు చేయా లని ఆదేశించింది. ఈ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు 5 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
నేటి నుంచి రంగంలోకి..అయినా..
మంగళవారం నుంచి మండలస్థాయిలో సర్వే, రెవెన్యూ అధికా రులు జాయింట్ ఎల్‌పీఎంల పరిశీలన చేపట్టనున్నారు. వీటిని విడదీసి ఎవరి భూమి వారికి కేటాయిస్తూ సింగిల్ ఎల్‌పీఎంలు కేటాయించనున్నారు. ఇలా చేయాలంటే జాయింట్ ఎల్‌పీఎంలో ఎంతమంది భూయజమానులు ఉన్నారో వారందరి ఆమోదంతో ఈ ప్రక్రియ చేపట్టాలి. ఈమేరకు చాలామందికి అధికారులు నోటీసులు పంపినా అసలు స్పందన ఉండడం లేదు. కొందరు యజమానులు ఎక్కడున్నారో తెలియడం లేదు. కొందరైతే నోటీ సులకు స్పందించి ప్రస్తుతానికి తమకు సింగిల్ ఎల్‌పీఎం వద్ద ని కబురు పంపుతున్నారు. దీంతో ఏం చేయాలో అధికారులకు తోచడం లేదు.యజమానులు లేకుండా ఈప్రక్రియ చేప ట్టకూ డదు. దీంతో సింగిల్ ఎల్‌పీఎం అవసరమైన రైతులకు ఎలా దీన్ని అందుబాటులో తీసుకురావాలనేదానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. సింగిల్ ఎల్‌పీఎం నెంబరు కోసం పోరాడు తున్న రైతులకు మిగిలిన వారి నుంచి సహకారం లేకపోవ డంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు ముందుకొస్తున్న కేసులపైనే దృష్టి పెడుతున్నారు.
Updated Date - Jul 01 , 2025 | 01:36 AM