శివారు భూములకు ప్రతీ రబీలో నీటి ఎద్దడే!
ABN, Publish Date - May 17 , 2025 | 12:46 AM
వరి పొలాలకు సేద్యపునీరు అందించే పంటకాల్వలను పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేపట్టకపోవడంతో రబీలో ప్రతీ ఏటా కాల్వ శివారు భూముల రైతులు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
ముమ్మిడివరం, మే 16(ఆంధ్రజ్యోతి): వరి పొలాలకు సేద్యపునీరు అందించే పంటకాల్వలను పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేపట్టకపోవడంతో రబీలో ప్రతీ ఏటా కాల్వ శివారు భూముల రైతులు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ముమ్మిడివరం మండల పరిధిలో ముఖ్యంగా మాగాం-అయినాపురం పంటకాల్వ, మాగాం-నక్కతిప్ప పంటకాల్వల శివారు భూముల రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. మాగాం-అయినాపురం పంటకాల్వ పరిధిలో క్రాపచింతలపూడి, ముమ్మిడివరం, సోమిదేవరపాలెం, అయినాపురం గ్రామాల పరిధిలో ప్రతీ సీజన్‌లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఈకాల్వపై ఆయా గ్రామాల పరిధిలో ఉపాధి పథకంలో గుర్రపుడెక్క, చెత్తా చెదారాన్ని తొలగించడానికి వీలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడి సమయంలో ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో జేసీబీతో చెత్తా చెదారాన్ని తొలగించినా, గుర్రపు డెక్క నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో సమస్య మళ్లీ మొదటికే వస్తుంది. దీంతో రబీ పంటకు సాగునీరు అందక రైతులు ఎన్నో వ్యయప్రయాశలకు గుర వుతున్నారు. అలాగే మాగాం-నక్కతిప్ప చానల్ కూడా చెత్తాచెదారం పేరుకుపోయి సాగునీరు సక్రమంగా అందడంలేదు. ఈ పంటకాల్వపై కూడా రబీలో సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఈకాల్వ శివారు భూములు కూడా సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మండలంలో మిగిలిన గ్రామాల్లో ఉపాధిహామీ పథకం అమలులో ఉండడంతో ఎంతో కొంత చెత్తాచెదారం, పూడికత తొలగింపు వంటి పనులు జరుగుతున్నాయి. అయితే మాగాం-అయినాపురం, మాగాం-నక్కతిప్ప పంటకాల్వలకు మాత్రం నగర పంచాయతీ పరిధిలో పూడిక తొలగింపు చేపట్టకపోవడంతో సాగునీరు సక్రమంగా సరఫరా కాక కాల్వ శివారు భూములు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
Updated Date - May 17 , 2025 | 12:46 AM