ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ..తాన్‌!

ABN, Publish Date - May 22 , 2025 | 01:06 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూదాన భూముల రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భూమిపై హక్కు ఉన్నా ఆన్‌ లైన్‌లో మార్పులు చేర్పులు జరగక..ఏ పథకాలు వర్తించక నానా తంటాలు పడుతున్నారు.

భూదాన బోర్డు భూములు

భూదాన్‌ భూముల అగచాట్లు

హక్కు ఉన్నా పథకాలకు దూరం

ఆన్‌లైన్‌లో మార్పులు చేర్పుల్లేవ్‌

పాతికేళ్లుగా ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో 4,211 ఎకరాలు

అధికారులకు రైతుల మొర

చనిపోయినా రికార్డుల్లోనే..

రీసర్వేలోను అదే తీరు

కళ్లెదుట భూమి..కాగితాల్లో లేదు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూదాన భూముల రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భూమిపై హక్కు ఉన్నా ఆన్‌ లైన్‌లో మార్పులు చేర్పులు జరగక..ఏ పథకాలు వర్తించక నానా తంటాలు పడుతున్నారు.అటు భూదాన బోర్డు పట్టించుకోక.. రెవెన్యూ అధికారులు సంబంధం లేదని వదిలేస్తుండడంతో నరక యాతన పడుతున్నారు. తమ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.ఎప్పుడో తాతల పేరున, తండ్రుల పేరునా ఉన్న రికార్డులే నేటికి ఆన్‌లైన్‌లో దర్శనమిస్తుండడంతో వాటిని తమ పేరున బదిలీ చేయించుకోవడానికి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూదాన యజ్ఞబోర్డు ఉండేది. ఇది భూదాన రైతులకు పట్టాలను మంజూరు చేసేది. ఈ బోర్డు నుంచి పట్టా తెచ్చుకున్న వారికి వారి పేరున అప్పట్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌ పుస్తకాలను సైతం రెవెన్యూ అధికారులు మంజూరు చేసేవారు. ఆ తర్వాత భూదాన్‌ బోర్డును తొలగించడంతో గతంలో ఎవరైతే ఆన్‌లైన్‌లో ఉన్నారో వారి పేరునే నేటికీ ఆన్‌లైన్‌లో భూమి చూపిస్తోంది. వీరి వారసులు, వారి నుంచి కొనుగోలు చేసు కున్న రైతుల పేర్లు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఆన్‌ లైన్‌లో నమోదు చేయడం లేదు. దీంతో వీరికి ఏ పథకాలు వర్తించడం లేదు. తమ తండ్రి చనిపోవడంతో వారసుడిగా తమ పేరును ఆన్‌ లైన్‌లో గుర్తించాలంటూ వేలాది మంది అన్న దాతలు ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించారు. అయి నా ఇప్పటికీ ఫలితం ఉండడం లేదు. భూదాన బోర్డు నుంచి ఆ భూమి తమదేనంటూ పత్రం మంజూరు చేయించుకుంటే తప్పించి తాము ఏం చేయలేమని అధికారులు తెగేసి చెప్పేస్తు న్నారు. చాలామంది రైతులకు అసలు భూదాన బోర్డు, రైతు చట్టాల పై అవగాహన లేదు.కొంత కాలంగా అధికారులు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటుచేసి భూసమస్యల పరిష్కారాని కి ముందుకు వచ్చారు. ఇవేవీ అన్నదాతల సమ స్యలు పరిష్కరించలేదు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలువురు రైతులు మాట్లాడుతూ పాతి కేళ్ల నుంచీ తమ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నా యని కన్నీటి పర్యంతమవుతున్నారు.

రీ సర్వేలోనూ అంతే...

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భూముల రీసర్వే జరుగుతోంది. రీసర్వే ద్వారా తమకు హక్కులు లభిస్తాయని, పాతికేళ్ల కింద ఉన్న పేర్లకు బదు లు వారసులుగా తమ పేర్లు ఆన్‌లైన్‌ అవుతా యని అన్నదాతలు భావించారు. కానీ రీసర్వేలో సైతం అధికారులు ఆ భూములు పాత యజ మాని పేరునే గుర్తిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం సాగులో ఉన్న రైతు పేర్లను ప్రస్తా విస్తూ భూదాన అధికారులకు పంపుతు న్నారు. ప్రస్తుత వారసులు తమ పేరున ఆన్‌లైన్‌ చేయాలని అర్జీలు ఇస్తున్నా భూదాన అధికా రులు నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో తమకు ఎప్పుడు హక్కులు వస్తాయో తెలియక వీరంతా దిగులు చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూదాన బోర్డు భూములను అప్పటి అధికార పార్టీ పెద్దలు కొం దరు అడ్డగోలుగా తమ పేరున ఆన్‌లైన్‌ చేయిం చేసుకున్నారు. తమ పలుకుబడి ఉపయోగించి అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ల ద్వారా పదుల కొద్దీ ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు పొందారు. అప్పుడు ఇద్దరు కలెక్టర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. పాతికేళ్ల కింద ఆక్రమించిన, కొనుగోలు చేసిన వాటిని ఇష్టానుసారం తమ పేరుపై బదిలీ చేయించేసుకుని హక్కులు పొం దారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం, తూ ర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉన్నట్టు సమాచారం. సామాన్య రైతుల గోడు మాత్రం ఎవరూ వినడం లేదు. 2000 ఏడాదికి ముందు కొనుగోలుచేసిన యజమానులు సైతం అర్జీలతో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

వారసులకు హక్కుల్లేవ్‌..

గతంలో ప్రభుత్వాలు భూదాన భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునే వేసులు బాటును కల్పిం చగా 2000 సంవత్సరం నుంచి నిలిపివేశాయి. ఆ తర్వాత వారసులు వీటిని తమ పేరుపై మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో 4,211 ఎకరాల్లో పాతికేళ్ల కిందట రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చనిపోయిన వారి స్థానం లో వారసుల పేర్లను సైతం తాజా రీసర్వేలోను గుర్తించడం లేదు. దీంతో వీరంతా తమ గోడు వినాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభు త్వంలో కొందరు పెద్దలు మాత్రం భూదాన భూములను పరపతితో ఆన్‌లైన్‌ చేయించేసు కున్నారు. సామాన్య రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. భూదాన బోర్డు భూముల ను పూర్వం నుంచీ సాగు చేసుకుంటున్న రైతులకు, వారి వారసులకు భూమిపై హక్కు కల్పిం చాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రస్తుతం పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో 2,268 ఎక రాలు, కాకినాడ డివిజన్‌లో 553, అమలాపురం డివిజన్‌లో 795, రాజమహేంద్రవరంలో 413 ఎకరాలు, రంపచోడవరం డివిజన్‌లో 179 ఎక రాలు, కొవ్వూరులో ఇదేవిధంగా భూదాన భూ ములు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నింటికి అప్పట్లో పట్టాలిచ్చేశారు. వీటిని అనుభవిస్తున్న రైతులకు సంబంధించి వారసులకు హక్కులు లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

Updated Date - May 22 , 2025 | 01:06 AM