రూ.1.5 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:45 AM
రామచంద్రపురం(ద్రాక్షారామ), జూలై 21 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజుపంతులు ఎడ్యుకేషనల్ ట్ర స్టుకు చెందిన రూ.1.5 కోట్ల విలువైన 45 సెంట్ల స్థలాన్ని సోమవారం దేవదాయశాఖ అధికారు లు స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం ద్రాక్షారామ మెయిన్‌రోడ్డు
ట్రిబ్యునల్ ఆదేశాలతో దేవదాయశాఖ అధికారుల చర్యలు
రామచంద్రపురం(ద్రాక్షారామ), జూలై 21 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజుపంతులు ఎడ్యుకేషనల్ ట్ర స్టుకు చెందిన రూ.1.5 కోట్ల విలువైన 45 సెంట్ల స్థలాన్ని సోమవారం దేవదాయశాఖ అధికారు లు స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం ద్రాక్షారామ మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషన్ ట్రస్టుకు చెందిన 45 సెంట్ల స్థలంలో ప్రయివేటు వ్యక్తులు సామిల్లు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లా పరిషత్‌కు లీజు చె ల్లించేవారు. తదుపరి దేవదాయ శాఖకు జె డ్పీ నుంచి ఆస్తులు బదిలీఅయిన తరువాత కొంత కాలంపాటు పేర్రాజుపంతులు ఎడ్యుకేషన్ ట్రస్టుకు లీజు చెల్లించారు. తదుపరి ఎటువంటి లీజు చెల్లించకపోవడంతో ఎడ్యుకేషనల్ ట్రస్టు ఈవో దేవదాయశాఖ ట్రిబునల్‌ను ఆశ్రయించారు. 45 సెంట్ల స్థలం కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషనల్ ట్రస్టుకు స్వాధీనం చేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో దేవదాయశాఖ డివిజన్ తనిఖీదారు బాలాజీరామ్‌ప్రసాద్ ఆద్వర్యంలో ఈవో ఎస్.సత్యనారాయణ ఆలయ సిబ్బంది స్థలంలో ప్రవేశించి స్వా ధీనం చేసుకున్నారు. ముందుగా నోటీసు ఇచ్చిన ప్రకారం ఆక్రమణదారులు దేవదాయశాఖ అధి కారులకు స్థలాన్ని అప్పగించారు. ఖాళీ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సత్యనారాయణ ఆదేశాల మేరకు స్థలానికి ఇనప కంచె ఏ ర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పరిధిలో వివిధ ఆలయాల ఈవోలు జొన్నాడ భీమశంకరం, యాళ్లవీరవెంకట సత్యనారాయణ, వి.బాలకృష్ణ, వి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:45 AM