కనుమరుగవుతున్న కోయ భాష
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:31 AM
లిపి లేని భాషలు కాలక్రమంలో కనుమరగ వుతున్నాయి. ఈ కోవలో కే కోయ భాష కూడా చేరుతుందన్న ఆందోళన ను ఆదివాసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2018 జూలై 21న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆది వాసీ మేధావులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కనుమరుగవుతున్న విశ్వ కోయ (గోం
ఆందోళన చెందుతున్న ఆదివాసీ సంఘాలు
నేడు విశ్వ కోయ (గోండి) భాషా దినోత్సవం
(చింతూరు - ఆంధ్రజ్యోతి)
లిపి లేని భాషలు కాలక్రమంలో కనుమరగ వుతున్నాయి. ఈ కోవలో కే కోయ భాష కూడా చేరుతుందన్న ఆందోళన ను ఆదివాసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2018 జూలై 21న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆది వాసీ మేధావులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కనుమరుగవుతున్న విశ్వ కోయ (గోండి) భాషలను సంరక్షించుకోవాలని తీర్మానించుకు న్నారు. ఆ మేరకు ప్రతి ఏటా జూలై 21న విశ్వ కోయ (గోండి) భాషా దినోత్స వాన్ని జరుపు కోవాలని నిచ్చయించుకున్నారు. నాటి నుంచి దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో వ్యాప్తి చెంది ఉన్న ఆదివాసీలు వివిధ ఆదివాసీ సంఘాల నేతృ త్వంలో విశ్వ కోయ భాషా దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు. కాగా ఈ దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలన్న ప్రఽధాన డిమాండ్ ప్రస్తుతం ఆదివాసీ సంఘాల నుంచి వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నట్టు అంచనా. ప్రాథమిక విద్య మాతృ భాషలోనే బోధించాల న్నది ఆదివాసీ మేధావుల అభిప్రాయంగా ఉంది. ఉమ్మడి రా ష్ట్రం నాటి కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో కొన్నేళ్ల పాటు ఒకటి నుంచి 3 వరకు తరగతులు కోయ భాష లోనే బోధించారు. స్థానిక ఆదివాసీ యవ తను ఉపాధ్యాయులుగా నియమించి గౌవర వేతనం చెల్లించేవారు. నాడు రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని 920 ఆదివాసీ ప్రాంత పాఠశాలల్లో 18,795 మంది ఆదివాసీ విద్యార్థులకు ఈ తరహా బోధన జరిగింది. ఖమ్మం, తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల్లో కోయ భాష, కర్నూలు, అనంత పురం సుగాలి భాష, విశా ఖపట్నం జిల్లాలో కువి, కొండ భాష, శ్రీ కాకుళం, విజయ నగరం జిల్లాల్లో సవర భాషలకు అనుగుణంగా కోయ భారతి పుస్తకాలను ముద్రించి బోధిం చారు. సహజంగా ఆదివాసీ చిన్నారులు వారి ఇళ్ల వద్ద మాతృ భాషలో మాట్లాడుతుంటారు. వారిని పాఠశాలల్లో చేర్పించి తెలుగు లేదా ఆయా రాష్ట్ర భాషల్లో బోధిస్తే పూర్తిగా అర్థంకాక చివరకు డ్రాప్ అవుట్స్ అవు తున్నారన్నది ఆది వాసీ సంఘాల వాదన. ఈ తరహా సమస్యను తొలగించాలంటే అంగన్‌వాడీ స్థాయి నుంచి మూడో తరగతి వరకు వారి మాతృ భాషలోనే బోధించాలని ఆదివాసీ మేధావులు అంటున్నా రు. కాగా ఉమ్మడి రాష్ట్రలో పడిన అడుగులు ఇప్పుడు మందగించాయన్న ఆరోపణ ఉంది.
Updated Date - Jul 21 , 2025 | 12:31 AM