హామీలు అమలు చేయకుంటే ఉద్యమం
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:22 AM
రంపచోడవరం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన కొండమొదలు నిర్వాసితులకు 2017లో కుదుర్చుకున్న ఒప్పదం ప్రకారం హామీలను అమలు చేయకుం టే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సర్పంచ్ వేట్ల విజయ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట నిరసన దీక్షను చేపట్టారు. ఎంవోయూ అమలు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అఽధికారులను హెచ్చరించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏఎ
రంపచోడవరం ఐటీడీఏ ఎదుట కొండమొదలు నిర్వాసితుల నిరసన దీక్ష
రంపచోడవరం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన కొండమొదలు నిర్వాసితులకు 2017లో కుదుర్చుకున్న ఒప్పదం ప్రకారం హామీలను అమలు చేయకుం టే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సర్పంచ్ వేట్ల విజయ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట నిరసన దీక్షను చేపట్టారు. ఎంవోయూ అమలు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అఽధికారులను హెచ్చరించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏఎస్ దినేష్‌కుమార్ గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తూ కొండమొదలు నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పిస్తామని 2017లో ఎంవోయూ చేసి నిర్వాసితులు అధికారులపై హైకోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకొనేలా చేశారని ఆరోపించారు. ఎంవోయూ చేసుకుని 8ఏళ్లు గడిచిన రాజకీయ నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి 2 దశాబ్దాలు గడుస్తున్నా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించాలని చట్టంలో ఉన్నా బలవంతంగా ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తరలిస్తున్నారన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కా ర్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహి ంచాలని పిలుపునిచ్చారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్షకు వామపక్ష, గిరిజన, ఆదివాసీ సంఘాల నాయకుల మద్దతు తెలిపా రు. కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లా రామిరెడ్డి, వంజం జోగారావు, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, కార్యదర్శి కుంజా దూలయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఉప్పెన కిరణ్, సీపీఐ డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్, హ్యూమన్ రైట్స్ వాచ్ అంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బాలు అక్కసా, రాజేష్. ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బొర్ర అజయ్‌కుమార్, సిరిమల్లిరెడ్డి, అనసూయ, భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:23 AM