కోనసీమ గోదావరి లంకల్లో వణుకు
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:17 AM
గోదా వరి ఎగువన పెరుగుతున్న వరద ఉధృతికి దిగువున నదీపాయలు నిండుగా ప్రవహిస్తు న్నాయి. దీంతో కోనసీమలోని గోదావరి లంక గ్రామాల్లో వణుకు మొదలైంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 5,29,209 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వదు లుతున్నారు.
పెరుగుతున్న గోదావరి
సాగుతున్న పడవ ప్రయాణాలు
కోనసీమలో నిండుగా ప్రవహిస్తున్న నదీపాయలు
అధికారుల అప్రమత్తం
పి.గన్నవరం, జూలై12(ఆంధ్రజ్యోతి): గోదా వరి ఎగువన పెరుగుతున్న వరద ఉధృతికి దిగువున నదీపాయలు నిండుగా ప్రవహిస్తు న్నాయి. దీంతో కోనసీమలోని గోదావరి లంక గ్రామాల్లో వణుకు మొదలైంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 5,29,209 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వదు లుతున్నారు. దీంతో కోనసీమ పరిధిలోని దిగువన ఉన్న గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ఠ వైనతేయ గోదావరి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం మండల పరి ధిలోని గంటిపెదపూడి, ఉడిమూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారి పేట, ఉడిమూడిలంక గ్రామస్తులు బూరుగు లంక నదీపాయ నుంచి ఇంజన్ పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రామాలైన పెదమ ల్లంక, అనగార్లంక, అయోధ్యలంక తదితర లంకగ్రామాల ప్రజానీకం పడవలపై రాకపో కలు సాగిస్తున్నారు. నదీపరీవాహక ప్రాంతా ల్లోకి వరదనీరు చేరడంతో స్థానిక కూరగా యల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం బూరుగులంక రేవు వద్ద అధికారులు రెండు ఇంజన్ పడవలు ఏర్పా టుచేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఆదివారం కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహించే అవకాశం ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో పి.గన్న వరం హెడ్‌వర్క్స్ కార్యాలయం వద్ద ఇసుక బస్తాలు, సంచులు, కర్రలను అధికారులు సిద్ధంచేశారు. అయితే భద్రాచలం వద్ద శని వారం మధ్యాహ్నం నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో స్థానిక ప్రజానీకం, అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
కోనసీమలో ఉధృతంగా..
ఆత్రేయపురం/ఆలమూరు/అయినవిల్లి/కె.గంగవరం/మామిడికుదురు/అల్లవరం/ జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరదతో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదనీటిని బ్యా రేజీ దిగువకు విడుదల చేయడంతో పాటు ప్రధాన కాల్వలకు నీటి సరఫరా పెంచడంతో ఆత్రేయపురం మండలంలోని గోదావరి సెం ట్రల్ డెల్టా పరిధిలోని కాలువలు అంచులను తాకుతూ ప్రవహిస్తున్నాయి. దీంతో అఽధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆలమూరు మండలంలోని బడుగువానిలంక, చెముడులంక, చొప్పెల్ల, జొన్నాడ ఆలమూరు, మడికి లంక భూముల్లోని వేలాది ఎకరాల్లో వివిధ రకాల వాణిజ్య పంటల సాగు జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గౌతమి, వృద్ధ గౌతమి తొగరపాయలు పోటెత్త డంతో అయినవిల్లి మండలంలో నదీపాయల వెంబడి ఉన్న సారవంతమైన భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ముక్తేశ్వరం తొగరపాయలో పాతవంతెనను వరద తాకింది. రెండు రోజులుగా నిలకడగా ఉన్న నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో పల్లపు ప్రాంతాల్లో ఉంటున్నవారు తమ వస్తు వులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా రు. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద పుష్కరాలరేవులోని సగం మెట్ల వరకు వరద నీరు చేరుకుంది. ఫెర్రీ రేవులో ర్యాంపు వరకు వరదనీరు చేరింది. ఇప్పటికే ఫెర్రీ రేవులో రాకపోకలు నిలిపివేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి, పెదపట్నంలంక, పెదపట్నం, పాశర్లపూడి గ్రామాల్లోని పలు పల్లపు ప్రాంతాలు వరద నీట మునిగాయి. ఆయా గ్రామాల ప్రజలు తమ వస్తువులను మెరక ప్రాంతాల్లోకి చేర్చుకుని జాగ్రత్త పడుతున్నారు. వైనతేయ గోదావరిలో వరదనీరు లంక గ్రామాలకు చేరువైంది. అల్లవరం మండలం బోడసకుర్రు, గోపాయిలంక, రెబ్బనపల్లి తదితర గ్రామాలకు వరద ముంపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 01:17 AM