ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూలుతుందో..ఏమో!

ABN, Publish Date - Jul 26 , 2025 | 01:02 AM

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పేదలకు పెద్ద దిక్కయిన కాకినాడ జీజీహెచ్‌ దీనంగా మారింది. వేలాది మంది రోగులకు సేవలంది స్తోన్న విభాగాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

జీజీహెచ్‌

స్లాబ్‌లకు లీకులు

పాత భవనాలతో భయం

జేఎన్‌టీయూ ఇంజనీర్ల పరిశీలన

తొలగించాలని నివేదిక

కొత్త నిర్మాణాలకు రూ.500 కోట్లు

ప్రభుత్వానికి ప్రతిపాదలు

పవన్‌ స్పందించాలని డిమాండ్‌

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పేదలకు పెద్ద దిక్కయిన కాకినాడ జీజీహెచ్‌ దీనంగా మారింది. వేలాది మంది రోగులకు సేవలంది స్తోన్న విభాగాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాడుబడిన భవనాలు, ఎప్పుడు కూలుతాయో తెలియని బ్లాకులు రోగులు, వైద్యులను నిరంతరం భయపెడుతున్నాయి. అసలే వర్షాకాలం ఆరంభమ వడంతో లీకవుతున్న శ్లాబ్‌లు, తడిచిపోతున్న రికార్డులతో జీజీహెచ్‌ ప్రమాదకరంగా మారింది. ఆసుపత్రికి కొత్త భవనాల నిర్మాణం అత్యవసర మైనా నిధుల్లేక ఈసురోమంటోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పేదలకు పెద్దదిక్కు కాకినాడ జీజీహెచ్‌. ఏ పెద్ద అనారోగ్యం వచ్చినా వారంతా వచ్చేది ఇక్కడికే. వందలాది మంది ఇన్‌పేషెంట్లు, ఔట్‌ పేషెంట్లతో ఈ ప్రభు త్వాసుపత్రి నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంతటి కీల కమైన కాకినాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అనేక ప్రధాన భవనాలు శిథిలస్థితికి చేరుకున్నా యి. ఇవి ఎప్పుడు కూలుతాయో అన్నట్టు మారా యి. అసలే వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ అనేక విభాగాల్లో గోడల దగ్గర నుంచి శ్లాబ్‌ల వరకు వర్షపునీరు లీకవుతోంది. దీంతో ఎప్పుడు ఏమవు తుందోననే ఆందోళన అందరినీ వెన్నాడుతోంది.

రోజూ వేలాదిగా రోగులు..

జీజీహెచ్‌ అవుట్‌ పేషెంట్‌ విభాగానికి రోజూ రెండు వేలమంది వరకు రోగులు వస్తారు. ఇన్‌ పేషెంట్‌ విభాగంలో 1,600 నుంచి 1,800 వరకు రోగులు ఉంటారు. నిత్యం వేలాది మంది రోగుల తో ఆసుపత్రి కిటకిటలాడుతుంటుంది. కార్డి యాలజీ, ఆర్థోపెడిక్‌, గైనకాలజీ, పిడియాట్రిక్‌, గ్యాస్ర్టో ఎంట్రాలజీ, యూరాలజీ వంటి ఎన్నో విభాగాల్లో రోగులకు కావాల్సిన సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, ఎక్స్‌రేలు అందుబాటులో ఉం టాయి. ఐసీయూలతోపాటు యాక్టివ్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్లు, ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్లు నిరంతరం పనిచేస్తాయి. 24 గంటలూ ఇక్కడ చికిత్స అందుతుంది. అటు జీజీహెచ్‌కు అనుబం ధంగా రంగరాయ మెడికల్‌ కాలేజీ నుంచి వం దలాది మంది వైద్యులు, నర్సులు జీజీహెచ్‌ విధుల్లో ఉంటారు. ఏ అనారోగ్యం వచ్చినా, ప్ర మాదాలు జరిగినా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ల లేక వేలాదిమంది ఇక్కడకే శస్త్రచికిత్సకు వస్తారు. ప్రధానంగా సోమవారం రోజైతే ఓపీ విభాగాలు కిక్కిరిసిపోతాయి. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి రిఫర్‌ కేసుల సంఖ్య ప్రతి రోజూ ఉంటుంది. ఏ పెద్ద ప్రమాదం జరిగినా ఆయా కేసులను వెంటనే కాకినాడకు రిఫర్‌ చేసేస్తారు.

బాబోయ్‌.. ఆ బ్లాకులు..

ఆసుపత్రిలో అనేక భవనాలు దాదాపు 50 నుంచి 60 ఏళ్లు దాటి పోయాయి. దీంతో అనేక బ్లాకులు ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టు న్నాయి. ప్రధానంగా అడ్మినిస్ర్టేష న్‌ భవనం రెండో అంతస్తులో శ్లాబ్‌ల నుంచి వర్షం నీరు లీక వడం వల్ల ఎంఆర్‌డీ సెక్షన్‌లో మెడికల్‌ రికార్డులన్నీ పాడవు తున్నాయి. పైగా స్లాబు పెచ్చు లూడిపోవడంతో కొన్ని ప్రత్యేక వార్డులను పూర్తిగా మూసివేశారు. ఇదే భవనంలో ఈఎన్‌టీ, డెంటల్‌ విభాగాలు, ఓపీ జరిగే విభాగాల్లో షెడ్లు వర్షాలకు పడిపోయాయి. సర్జికల్‌వార్డు, ఆర్థోపెడిక్‌, అడ్మి నిస్ట్రేషన్‌ భవనం, మెడికల్‌ వార్డు భవనాలు శిథిలస్థితికి చేరుకు న్నాయి. జీప్లస్‌3 విధానంలో ఉన్న ఈ భవనాలన్నీ కూల్చాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ పాత భవనాలు తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు మూలుగు తున్నాయి. గత వైసీపీ సర్కారు అయితే కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం దారి మళ్లిం చేసింది. కానీ ఆసుపత్రి భవనాలు మాత్రం నిర్మించలేదు. పలుసార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్య టనల్లో పాత భవనాల నిర్మాణా లకు నిధులిస్తున్నట్టు చెప్పినా కనీసం చిల్లిగవ్వ ఇవ్వలేదు.

నిధులెప్పుడిస్తారో..

గతేడాది కాకినాడ జేఎన్టీయూ ఇంజనీర్లు ఈ భవనాలన్నింటిని పరిశీలించారు. వీటిలో అనేక భవనాలు బలహీనంగా ఉన్నట్టు గుర్తించారు. అనేక బ్లాకులు తొలగించాల్సిందేనని ఇప్పటికే నివేదిక ఇచ్చారు. పాడైన భవనాలను తొలగించి వాటి స్థానంలో జీప్లస్‌ 8 విధానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాలు నిర్మించాలని ఇంజ నీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని తేల్చారు. ఈమేరకు నిధు లు విడుదల చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి గతేడాది నివేదిక పంపారు. కొత్త భవనాల్లో 600 పడకలు ఉండేలా ప్రణాళిక లు రూపకల్పన చేశారు. నిధుల విడుదలకు కలె క్టర్‌ షాన్‌మోహన్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పారు. వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు గుర్తుచేసినా ప్రతిపాదనలు పరిశీలి స్తున్నట్టే చెబుతున్నారు. జీజీహెచ్‌కు కొత్త భవనా లు ఎప్పుడు సమకూరుతాయో తెలియని పరిస్థితి. జిల్లా మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పం దించి నిధులు విడుదలపై దృష్టిసారించాల్సి ఉంది.

Updated Date - Jul 26 , 2025 | 01:02 AM