ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖత్తర్‌లో కష్టాలు. ఎంపీ సహాయంతో స్వగ్రామం..

ABN, Publish Date - May 24 , 2025 | 01:06 AM

ఖత్తర్‌లో నరకయాతన పడుతున్న మహిళ ఎంపీ హరీష్‌ సహాయంతో ఆమె స్వగ్రామం చేరుకుంది.

అంబాజీపేట, మే 23(ఆంధ్రజ్యోతి): ఖత్తర్‌లో నరకయాతన పడుతున్న మహిళ ఎంపీ హరీష్‌ సహాయంతో ఆమె స్వగ్రామం చేరుకుంది. అంబాజీపేట మండలం తొండవరానికి గ్రామానికి చెందిన ఉందుర్తి నాగదుర్గ గత ఏడాది 29న సమీప బంధువులతో సహకారంతో ఖత్తర్‌ వెళ్లింది. 31 ఖత్తర్‌ చేరుకుని అక్కడున్న ఓ మేడమ్‌ వద్ద వంట పనికి చేరింది. నాలుగు నెలలు తర్వాత మేడమ్‌ కుమార్తె వచ్చి ఖత్తర్లో ఓ సిటీలో ఉంటున్న తన ఇంటికి కుక్‌ పనికి దుర్గను తీసుకువెళ్లింది. రెండు నెలలు అనంతరం తిండి పెట్టకుండా భర్త ప్రశాంత్‌, పిల్లలు, బంధువులతో ఫోన్‌ మాట్లాడకుండా దుర్గను చిత్రహింసలకు గురిచేసింది. దీంతో దుర్గ ఈవిషయంపై భర్తకు వాట్సాప్‌ మేసేజ్‌ పంపించింది. దీంతో భర్త ప్రశాంత్‌ ఈవిషయాన్ని స్థానిక సర్పంచ్‌ పేరాబత్తుల దొరబాబు, ఉపసర్పంచ్‌ దిగుమర్తి చిట్టిబాబుకు వివరించాడు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు ఈవిషయాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలకు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో ఈనెల 22వ తేదీ అర్ధరాత్రి స్వగ్రామం తొండవరం క్షేమంగా చేరుకున్నట్లు నాగదుర్గ తెలిపింది.

Updated Date - May 24 , 2025 | 01:06 AM