కాకినాడ జిల్లాలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు : జేసీ
ABN, Publish Date - May 17 , 2025 | 01:32 AM
కలెక్టరేట్ (కాకినాడ), మే 16 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో చెరువులు, కాలువలు, డ్రెయిన్లు, వాగులు వంటివి ఆక్రమణకు గురికాకుండా, ధ్వంసం కాకుండా కాపా డాలని జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా అధికారులను ఆదేశించారు. నీటి నిల్వ చేసే కాలువల సంరక్షణపై రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లా వాచ్ డాగ్ కమిటీ తొలి సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆక్రమణలు, దుర్వినియోగం వల్ల జలవనరులు అంతరించి దుష్పరిణామా
కలెక్టరేట్ (కాకినాడ), మే 16 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో చెరువులు, కాలువలు, డ్రెయిన్లు, వాగులు వంటివి ఆక్రమణకు గురికాకుండా, ధ్వంసం కాకుండా కాపా డాలని జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా అధికారులను ఆదేశించారు. నీటి నిల్వ చేసే కాలువల సంరక్షణపై రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లా వాచ్ డాగ్ కమిటీ తొలి సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆక్రమణలు, దుర్వినియోగం వల్ల జలవనరులు అంతరించి దుష్పరిణామాలకు దారితీయకుండా నివారించేందుకు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు సభ్యులుగా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో వాచ్‌డాగ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నా రు. జిల్లా రికార్డుల్లో నమోదైన చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, డ్రెయిన్ల వంటి నీటి నిల్వ కేంద్రాలను పరిశీలించి ఇప్పటికే ఆక్రమణకు గురైతే వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలు, చెరువుల గట్లను డంపింగ్ యార్డులుగా వినియోగించవద్దన్నారు. కాలువలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ బాడీస్ ఆక్రమణకు సంబంధించి కోర్టు వివాదాలకు సత్వర పరిష్కారం చేయాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ప్రతినెలా నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల సమావేశానికి కాలువ లు, చెరువులు ఆక్రమణల విస్తీర్ణంలో ఉన్న పంటల సాగు, సివిల్ నిర్మాణాల వివరాలు తేవాలని, ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో వెంకట్రావు, మున్సిపల్ ఆర్డీ నాగనరసింహారావు, డీపీవో రవికు మార్, ఆర్డీవోలు మల్లిబాబు, శ్రీరమణి, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 01:32 AM