ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జయ‘లక్ష్మి వచ్చేనా’!

ABN, Publish Date - Jul 28 , 2025 | 11:49 PM

ఉమ్మడి జిల్లాలో జయలక్ష్మి సొసైటీ కుంభ కోణం బాధితులు ఈసురోమంటున్నారు. స్కాం జరిగి మూడేళ్లు దాటేసినా న్యాయం జరగక లబోదిబోమంటున్నారు.

జయలక్ష్మి సొసైటీ

రూ.582 కోట్ల కుంభకోణం

మూడేళ్లు దాటినా నేటికీ అంతే

రూ.450 కోట్లు ఆస్తులు సీజ్‌

అమ్మేసే వీలున్నా అడుగులు నిల్‌

రోడ్డెక్కుతున్న బాధితులు

డిపాజిటర్లు 19,600 మంది

ఇప్పటికే 80 మంది మృతి

రూ.200 కోట్లకు కలెక్టర్‌ ప్రయత్నం

అయినా కానరాని స్పందన

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో జయలక్ష్మి సొసైటీ కుంభ కోణం బాధితులు ఈసురోమంటున్నారు. స్కాం జరిగి మూడేళ్లు దాటేసినా న్యాయం జరగక లబోదిబోమంటున్నారు. పోగొట్టుకున్న సొమ్ము చేతికి రాక విలవిల్లాడుతున్నారు. ఇంట్లో పిల్లల పెళ్లిళ్లు తదితర కారణాలకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక నరకయాతన పడుతున్నా రు. సీజ్‌ చేసిన రూ.450 కోట్ల విలువైన ఆస్తుల్లో కొంతైనా వేలం వేసి చిన్న డిపా జిటర్లకు డబ్బు లు చెల్లించే వీలున్నా సీఐడీ కనీసం ఆ దిశగా ప్రయత్నం చేయక పోవడంతో బాధితులు అల్లా డుతున్నారు. నష్టపోయిన వారికి చెల్లించడానికి కనీసం 40 శాతం రూ.200 కోట్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ శాన్‌ మోహన్‌ సైతం లేఖ రాసినా ఉలుకూపలుకు లేదు. మరో పక్క డిపాజిటర్ల సొమ్ము రూ.43 కోట్లు కొట్టేసి లం డన్‌ పారిపోయిన ఉదయ శంకర్‌ను సీఐడీ ఇప్పటికీ వెనక్కు రప్పించలేక పోయింది. దీంతో తమకెప్పుడు న్యాయం జరుగుతుందంటూ డిపా జిటర్లు రోదిస్తున్నారు.దీనిపై కలెక్టర్‌ శాన్‌మోహ న్‌ వివరణ కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మని,సాధ్యమైనంత వరకు భూముల వేలం లేదంటే రూ.200కోట్లు మంజూరయ్యేలా మరో సారి ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.

రూ.582 కోట్లు కొట్టేశారు...

కాకినాడ రూరల్‌లోని సర్పవరం జంక్షన్‌ ప్రధా న కేంద్రంగా 1999లో ఏర్పాటైన ది జయలక్షి మ్యూచువల్‌ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ సంస్థ మూడున్నరేళ్ల కిందట ఖాతాదారులకు నిలువునా శఠగోపం పెట్టింది. అధిక వడ్డీల ఆశ చూపించి ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ, కృష్ణా, విశాఖ జిల్లా ల్లో 29 బ్రాంచిల ద్వారా 19,600 మంది నుంచి రూ.582 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసి బిచాణీ ఎత్తేసింది. బాధితుల ఆందోళనలతో జిల్లా సహకారశాఖ, సీబీసీఐడీ అధికారులు విచారణ పూర్తి చేసి రూ.582 కోట్ల మేర ఆర్థికమోసానికి పాల్పడినట్టు గుర్తించారు. 348 పే జీల నివేదికను 2023లో ప్రభుత్వానికి అందిం చారు. 19 వేల మంది నుంచి రూ.458 కోట్లు డిపాజిట్లు సేకరించినట్టు, 2,245 మందికి రూ.455.78 కోట్లు రుణాలు ఇచ్చినట్లు తేల్చా రు. రుణాల్లో కేవలం రూ.120 కోట్లకు మా త్రమే లెక్కలుండగా మిగిలి నవన్నీ బినామీ రుణాలుగా గుర్తించారు. ప్రధానంగా 49 మం ది రుణాల కింద రూ.43.04 కోట్లు వైస్‌ చైర్మన్‌ విశాలాక్ష్మి మేనల్లుడు ఆకెళ్ల ఉదయశంకర్‌ నొక్కేశాడని గుర్తించారు.లండన్‌ పారిపోయిన ఉదయశంకర్‌ను రప్పించేందుకు సీఐడీ అధికారులు రెడ్‌కార్నర్‌ నోటీసు సైతం జారీ చేశారు.

సూత్రధారులు వీళ్లే..

కుంభకోణానికి ప్రధాన సూత్రదారులుగా జయలక్ష్మి సొసైటీ చైర్మన్‌ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్‌ చైర్మన్‌ రాయవరపు బదరీ విశాలాక్ష్మి, డైరెక్టర్లు రాయవరపు జయమణి, చక్రభాస్కరరావు, ప్రబల మల్లిఖార్జునరావు, మంగళంపల్లి వెంకట సుబహ్మణ్యకుమార్‌, వారణాసి శాంతేశ్వరరావు, దూళ్ల శ్రీనివాస్‌, ఆర్‌ నా గేశ్వరరావు, జయశంకర్‌లుగా నిర్థారించి నిందితుల ను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. 159 మంది నిందితులపై సీఐడీ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచిం ది. వీరికి సంబంధించిన 98 ఆస్తులకు చెందిన రూ.450 కోట్ల విలువైన స్థిరాస్తులను సొసైటీ చొరవతో సీఐడీ సీజ్‌ చేసి కోర్టుకు సమర్పించింది. రుణాలు తీసుకున్న 235 మందిపై ట్రిబ్యునల్‌లో కేసు నమోదు చేయగా ఇప్పటి వరకు 40 మందిపై కోర్టులో నెంబర్‌ దాఖలైంది.

ఎవరెవరు ఎంతిచ్చారు..

వాస్తవానికి బాధితుల్లో ఎక్కువగా రూ.లక్షలోపు డిపాజిట్‌దారులు 13,249 మంది ఉండగా రూ.32.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల్లోపు డిపాజిటర్లు 2,384 మంది ఉండగా రూ.37.83 కోట్లు చెల్లించాలి. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల్లోపు 810 మంది ఉండగా వీరికి రూ.27.99 కోట్లు, రూ.5 లక్షల్లోపు బాధితులు 677 మందికి రూ.30.41 కోట్లు, రూ. 5 లక్షలు ఆపైన 2,563 మంది ఉండగా వీరికి రూ.349 కోట్లు చెల్లించాలి.రూ.582 కోట్ల కుంభకోణంలో వైస్‌ చైర్మన్‌ విశాలాక్ష్మి ఒక్కరే ఎటు వంటి సెక్యూరిటీ లేకుండా బినామీలతో సుమారు రూ.300 కోట్లు కొట్టేయడం గమనార్హం.

ఏళ్ల గడుస్తున్నా న్యాయమేది?

ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసి డిపాజిట్‌దా రులకు చెల్లింపులు జరిగేలా సీఐడీ ప్రయత్నం చేయాలి. కానీ అదేదీ ఇంకా జరగలేదు. రెడ్‌ కార్నర్‌ నోటీసు ద్వారా ఉదయశంకర్‌ను అరెస్ట్‌ చేసి అప్పుడు వేలం వేయాలని సీఐడీ భావి స్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉం డగా బాధితులకు 40 శాతం కింద రూ.200 కోట్లు తక్షణం విడుదల చేయాలని గతేడాది అక్టోబరులో జిల్లా కలెక్టర్‌ శాన్‌మోహన్‌ డీజీపీకి లేఖరాశారు.తద్వారా చిన్న డిపాజిటర్లకు మేలు జరుగుతుందని వివరించా రు. చిరు డిపాజిటర్లను దృష్టిలో ఉంచుకుని రూ.200 కోట్లు మంజూరు చేయడం పెద్ద కష్ట మైన పనే కాదు.స్థిరాస్తుల వేలం లేదా తాత్కా లిక సర్దుబాటు కింద నిధులు మంజూరు చేసి డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉండగా, సీఐడీ కనీ సం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. గత నెలాఖరులోగా 25 శాతం మేర బాధితులకు నగదు పంపిణీ చేసే విధంగా కృషి చేస్తున్నట్టు పాలకవర్గం ప్రకటించినా జరగలేదు. దీంతో న్యా యం కోసం బాధితులు రోడ్డెక్కుతున్నారు. ఇప్ప టికే 80మంది చనిపోయారు.కనీసం మృతి చెం దిన కుటుంబాలను ఆదుకునేందుకు పాల కవ ర్గం,అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సీఎం చంద్రబాబును కలుస్తాం..

త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తాం. బాధితుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేయాలి. ఇప్పటికీ ఒక్క కేసుకీసేల్‌ ఆర్డర్‌ రాకపోవడంతో బాధితులు ఆందోళనలో ఉన్నారు. రూ.300 కోట్ల ఆస్తులపై ట్రిబ్యునల్‌కి వెళ్లగా 11 కేసులకు కోర్టు డిక్రీ ఇచ్చింది.తీర్పు తొందర్లో వస్తే వెంటనే ఆస్తుల వేలం నిర్వహిస్తాం.

- గంగిరెడ్డి త్రినాథరావు, సొసైటీ చైర్మన్‌

Updated Date - Jul 28 , 2025 | 11:57 PM