ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాకినాడ జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:34 AM

జీజీహెచ్‌ (కాకినాడ), జూలై 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రోగ నిర్ధారణ ల్యాబ్‌లకు చెందిన ఉద్యోగులకు రెండు సెక్షన్‌లలో బెయిల్‌ వచ్చినా మైనర్‌ బాలికలపై వేధింపులకు గురిచేసిన పోక్సో కేసులో మాత్రం నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కావడంతో బెయిల్‌ అనివార్య

నలుగురు నిందితులకు పోక్సో కేసులో రిమాండ్‌

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌కి తరలింపు

జీజీహెచ్‌ (కాకినాడ), జూలై 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రోగ నిర్ధారణ ల్యాబ్‌లకు చెందిన ఉద్యోగులకు రెండు సెక్షన్‌లలో బెయిల్‌ వచ్చినా మైనర్‌ బాలికలపై వేధింపులకు గురిచేసిన పోక్సో కేసులో మాత్రం నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కావడంతో బెయిల్‌ అనివార్యమయ్యింది. వివరాల్లోకి వెళితే కళ్యాణ్‌ చక్రవర్తి, బి.జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లు 55 మంది ఎంఎల్‌టీ విద్యార్థినులను వేధింపులకు గురిచేయగా వారు కొంతకాలం పా టు బిక్కుబిక్కుమని ఎవరికి చెప్పకుండా బాధ ను దిగమింగుకుని విధులకు హాజరైనా ఆ కీచుకుల ఆగడాలు శృతిమించడంతో కళాశాల యా జమాన్యానికి భయంభయంగా మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో కళాశాల ప్రిన్సిపాల్‌ వేగంగా నిందితులపై పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. దాంతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్‌ 354, సెక్షన్‌ 519 కింద, అలాగే టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే 2 సెక్షన్‌లో బెయిల్‌ మంజూరైనా పోక్సో కేసులో మాత్రం నలుగురికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం సెం ట్రల్‌ జైల్‌కి తరలించారు. అయితే నిందితుడు జిమ్మిరాజును కేసు నుంచి తప్పించడం కోసం అతడి మేనమామ బూరిగ ఆశీర్వాదం చేసిన ప్రయత్నం పోక్సో కేసు అవ్వడంతో ఫలించలేదు.

Updated Date - Jul 14 , 2025 | 12:34 AM