ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABN, Publish Date - May 04 , 2025 | 01:32 AM

ఓవైపు హోరున కురిసిన వర్షం.. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో కబడ్డీ ఆడేందుకు సిద్ధమైన మహిళా, పురుష క్రీడాకారులు.. బీచ్‌ కబడ్డీని వీక్షించేందుకు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. వర్షానికి కబడ్డీ పోటీలు జరుగుతాయో లేదోనన్న మీమాంసతో నిర్వాహకులు ఉన్నారు. సాయంత్రం వర్షం తెరిపి ఇవ్వడంతో బీచ్‌ కబడ్డీ పోటీలు శనివారం యథావిధిగా కొనసాగాయి.

క్రీడాకారులకు సెల్ఫీ ఇస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు

రెండోరోజు హోరాహోరీగా రాష్ట్రస్థాయి బీచ్‌ కబడ్డీ పోటీలు

వర్షం కురిసినా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

వీక్షించిన ఎమ్మెల్సీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు

సెమీఫైనల్స్‌కు చేరిన మహిళా, పురుషుల జట్లు

ఓవైపు హోరున కురిసిన వర్షం.. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో కబడ్డీ ఆడేందుకు సిద్ధమైన మహిళా, పురుష క్రీడాకారులు.. బీచ్‌ కబడ్డీని వీక్షించేందుకు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. వర్షానికి కబడ్డీ పోటీలు జరుగుతాయో లేదోనన్న మీమాంసతో నిర్వాహకులు ఉన్నారు. సాయంత్రం వర్షం తెరిపి ఇవ్వడంతో బీచ్‌ కబడ్డీ పోటీలు శనివారం యథావిధిగా కొనసాగాయి.

సర్పవరం జంక్షన్‌, మే 3(ఆంధ్ర జ్యోతి): కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పం తం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రెండోరోజు శనివారం సాయంత్రం కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర అంతర జిల్లాల బీచ్‌ కబడ్డీ పోటీలు మహిళా, పురుషల జట్లకు వేర్వేరుగా హోరాహోరీగా సాగాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అన్న స్థాయిలో రసవత్తరంగా జరిగాయి. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి క్రీడా మైదానమంతా చిత్తడిగా మారినా ఎమ్మెల్యే నానాజీ యుద్ధప్రాతిపదికన కార్పెట్లు ఏర్పాటు చేసి కబడ్డీ పోటీలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. రెండోరోజు కబడ్డీ పోటీలను డిప్యూటీ సీఎం పవన్‌ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు వీక్షించారు. అనం తరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని రాష్ట్ర క్రీడాస్ఫూర్తిని దేశానికి చాటిచెప్పాలని కోరారు. క్రీడలతో వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు రాష్ట్రానికి ఖ్యాతి లభిస్తుందన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ మాట్లాడుతూ రాష్ట్ర బీచ్‌ కబడ్డీ పోటీల్లో సత్తాచాటిన జట్లు జాతీ యస్థాయికి ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. రాష్ట్రస్థాయి బీచ్‌ కబడ్డీ క్రీడలను వ్యయప్రయాసల కోర్చి చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పంతం నానాజీని అభినందించారు. నానాజీ ఆధ్వర్యంలో ఈనెల 21, 22వ తేదీల్లో ప్యాన్‌ పార్క్‌ ఐపీఎల్‌ క్రీడలు జిల్లా క్రీడామైదానంలో నిర్వహిస్తున్నట్టు సతీష్‌ తెలిపారు. బీచ్‌ సందర్శనకు వచ్చే వారికిఅన్నిరకాల సౌకర్యాలు కల్పించేందుకు కు డా నుంచి రూ.3కోట్లు మంజూరు చేశామని కుడా చైర్మన్‌ తుమ్మల రామస్వామి తెలిపారు. కబడ్డీ పోటీలను వీక్షించిన వారిలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, దాట్ల బుచ్చిబాబు, గిడ్ల సత్యనారాయణ ఉన్నారు. వర్షం కారణంగా సాయంత్రం 4గంటలకు ప్రారంభం కావాల్సిన కబడ్డీ పోటీలు 6 గంటలకు ప్రారంభమయ్యాయి. తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు.

Updated Date - May 04 , 2025 | 01:32 AM