రేపు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాక
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:07 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటన అధికారికంగా ఖరారైంది. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పర్యటనలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించనున్నారు. రచ్చబండలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.
పిఠాపురంలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్
పిఠాపురంలో రచ్చబండ
ప్రజలతో ముఖాముఖి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పిఠాపురం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటన అధికారికంగా ఖరారైంది. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పర్యటనలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించనున్నారు. రచ్చబండలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంనుంచి ఈనెల 25న ఉదయం 9.20 గంటలకు పిఠాపురం పాతబస్టాండు వద్దగల ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకు ని అక్కడ ఉదయం 9.30గంటల నుంచి 10.15గంటల వరకూ నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 11గంటలకు కొత్తపల్లి చేరుకుని అక్కడ టీటీడీ కల్యాణ మండపం నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. అక్కడినుంచే గొల్లప్రోలు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం రథాలపేట అంబేడ్కర్ కమ్యూనిటీ హాలుకు చేరుకుని అక్కడ జరిగే టైలరింగ్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలు, రైతులకు టార్పాలిన్లు అందజేస్తారు. మధ్యాహ్నం 12.35గంటలకు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని 100 పడకల ఆస్పత్రి అప్‌గ్రేడేషన్ పనులకు శంకుస్థాపన చేసి అక్కడనుంచే సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం 1.15గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో మంగళగిరి వెళ్తారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. పవన్‌పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీ బిందు మాధవ్, జేసీ రాహుల్‌మీనా, జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులతో కలిసి బుధవారం ఆయన పరిశీలన జరిపారు. హెలిప్యాడ్, పిఠాపురం ప్రభుత్వాస్పత్రి, రచ్చబండ నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. ఆయన వెంట కాకినాడ ఏఎస్పీ దేవరాజ్‌మనీష్ పాటిల్, అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఆర్‌వో వెంకట్రావు, పాడా ప్రాజెక్టు అధికారి చైత్రవర్షిణి ఉన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 01:07 AM