ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంజనీరింగ్‌ సీట్ల లెక్క తేలింది..

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:33 AM

జేఎన్టీయూకే, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఎప్పుడు జరుగుతాయ ని ఎదురుచూస్తున్న విద్యార్థులకు కళాశాలల్లో ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌ కానుంది. ఏపీఈఏపీసెట్‌కు సంబంధించిన వెబ్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 7న ప్రారంభమైంది 16 వరకూ ఆన్‌లైన రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు,

జేఎన్టీయూకే పరిధిలో సీట్లు ఖరారు

2025-26 విద్యాసంవత్సరానికి 106 కళాశాలలకు గుర్తింపు

నూతనంగా రెండు ఇంజనీరింగ్‌ కళాశాలలు

ఇంజనీరింగ్‌లో సుమారు 30వేల సీట్లకు అనుమతి

18 వరకూ వెబ్‌ ఆప్షన్ల నమోదు

జేఎన్టీయూకే, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఎప్పుడు జరుగుతాయ ని ఎదురుచూస్తున్న విద్యార్థులకు కళాశాలల్లో ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌ కానుంది. ఏపీఈఏపీసెట్‌కు సంబంధించిన వెబ్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 7న ప్రారంభమైంది 16 వరకూ ఆన్‌లైన రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, 17 వరకూ ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగనుంది. వెబ్‌ ఆ ప్షన్ల ప్రక్రియ ఈనెల 18 వరకూ కొనసాగనుంది. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ఇంజ నీరింగ్‌ సీట్ల సంఖ్యపై ఉన్నత విద్యామండలికి నివేదిస్తేనే అక్కడ నుంచి కౌన్సెలింగ్‌కు సంబంధి ంచిన నోటిఫికేషన్‌ వస్తుంది. రాష్ట్రంలోని అత్య ధి క కళాశాలలకు అనుసంధానంతో పాటూ సాంకేతిక వర్శిటీల్లో రాష్ట్రంలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నివేదికను పంపించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇం జనీరింగ్‌ కళాశాలలు విశ్వవిద్యాలయానికి అనుభందంగా ఉన్నాయి.

106 కళాశాలలకు గుర్తింపు

2025-26 విద్యాసంవత్సరానికి జేఎన్టీయూకే ఉన్నత విద్యామండలికి సీట్ల కేటాయింపు కోసం నివేదించింది. వర్శిటీకి అనుబంధంగా ఉన్న 106 కళాశాలల్లో ఇంజనీరింగ్‌లో సుమారుగా 30వేల సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే గతేడాది మాదిరిగానే ఈ విద్యాసంవత్సరం కూడా విద్యార్థులు సీఎస్‌ఈ, ఏఐ వైపు మొ గ్గుచూపుతున్నారు.

ఆన్‌లైన్‌లో కళాశాలల తనిఖీ

ఏపీఎస్సీహెచ్‌ఈ ఆదేశాల మేరకు వర్శిటీ అనుబంధ కళాశాలల తనిఖీలు ఆన్‌లైన్‌లో చేపట్టారు. కళాశాలలోని వసతులు, స్థితిగతులు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విద్యార్థి- అ ధ్యాపకుల నిష్పత్తి, ఆట స్థలం, కళాశాల క్యాం పస్‌ పరిస్థితి, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్‌ లు తదితర అంశాలను నిజనిర్ధారణ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) పర్యవేక్షణ చేస్తుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు ఏఏ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ఏఐసీటీఈ నుం చి అనుమతి తెచ్చుకున్న ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఎన్నిసీట్లకు యూనివర్శిటీ అనబంధ గుర్తిం పు ఇస్తుందనే అంశానికి ఎఫ్‌ఎఫ్‌సీ సిఫార్సులే కీలకం. అయితే ఈ కమిటీలో వర్శిటీకి చెందిన ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. ఏపీఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్లపై సందిగ్ధత వీడింది.

జేఎన్టీయూకే పరిధిలో 164 కళాశాలలుండగా వాటిలో 106 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లను భ ర్తీ చేయనున్నారు. 4 కళాశాలలు డీమ్డ్‌ యూనివర్శిటీలుగా, 8 కళాశాలలు జీరో ప్రవేశాల కారణంగా, రెండు కళాశాలలు మెర్జ్‌ కాగా మరొక కళాశాలను మూసివేశారు. 34 ఫార్మసీ కళాశాలలు, 9 ఎంబీఏ, ఎంసీఏ మేనేజ్‌మెంట్‌ కళాశాలలున్నాయి. అయితే ఈ ఏడాది రెండు నూతన ఇంజనీరింగ్‌ కళాశాలలు అనుమతి పొందాయి.

ఉన్నత ప్రమాణాలున్న కళాశాలలకే గుర్తింపు

ఏపీ ఉన్నత విద్యామండలి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్శిటీలు, ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రమాణాలను ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలన చేసి అనుమతి ఇవ్వాలని సూచించింది. వాటి ప్రకారం కాకినాడ జేఎన్టీయూ నుంచి ఆన్‌లైన్‌లో పరిశీలన నిర్వహించాం. సాంకేతిక విద్యలో ఉన్నతప్రమాణాలు పాటించిన అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపునిచ్చాం. ఆ విధమైన కళాశాలల్లో అభ్యసిస్తే విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

జేఎన్టీయూకే ఉపకులపతి, ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌

Updated Date - Jul 14 , 2025 | 12:33 AM