టీవీఆర్ నిరసన ప్రదర్శన
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:27 AM
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత లభించడం లేదని జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే టీ.వీ.రామారావు ధర్నా చేశారు.
కొవ్వూరు,జూలై 10 (ఆంధ్రజ్యోతి) : నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత లభించడం లేదని జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే టీ.వీ.రామారావు ధర్నా చేశారు. కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి టోల్‌గేటు సెంటర్‌లో గురువారం ఉదయం జనసైనికులు నల్లరిబ్బన్లు ధరించి రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే టీ.వీ.రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం నిబంధనలు పాటించడం లేదని ఆరోపించా రు. కొవ్వూరులో కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. కొవ్వూరు నియోజకవర్గం 14 సొసైటీల్లో జనసేనకు 3 సొసైటీలు ఇవ్వాలని అడిగినా ఎటువంటి సమాచారం లేకుండా సొసైటీలకు త్రిసభ్య కమిటీలు వేసుకోవడం ఎంతవరకు సబబు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎరుబండి సురేష్, పసలపూడి తాతారావు, నామాన చిన్నబూరయ్య, కల్లూరి సుబ్రహ్మణ్యం, ముప్పనపల్లి వీరబా బు, చీకట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి పదవి నుంచి తొలగింపు
పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం,కార్యక్రమాలను నిర్వహించడంతో కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి పదవి నుంచి టి.వి.రామారావును తొలగిస్తూ జనసేన పార్టీ కాన్ల్పిక్ట్ మేనేజ్‌మెంటు హెడ్ వేములపాటి అజయ్‌కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా చర్యలు ఉండడంతో తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూ రంగా ఉండాలని సూచించారు. అయితే అంతకుముందు టీవీఆర్ కొవ్వూరులో పరిస్థి తులపై సీఎం నారాచంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లకు లేఖ రాసినట్టు సమాచారం.
Updated Date - Jul 11 , 2025 | 01:27 AM