ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగరతీరం.. ఆనంద మైదాన్‌!

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:42 AM

కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానం క్రికెట్‌ అభిమానులతో కిక్‌..రిసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌తో క్రికెట్‌ అభిమానులతో సందడి.. సందడిగా మారింది. క్రికెట్‌ ప్రేక్షకుల కోసం బీసీసీఐ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటు చేసిన ఐపీఎల్‌ లైవ్‌ మ్యాచ్‌ వీక్షణకు అశేష స్పందన లభించి ంది.గ్రౌండ్‌లో 10 వేల మందికి ఏర్పాట్లు చేయగా 20 వేల మంది మ్యాచ్‌ వీక్షించడానికి హాజరైనట్టు అంచనా. సెమీ ఫైనల్‌

కాకినాడలో కిక్కిరిసిన క్రీడామైదానం, బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌ వద్ద వేడుకలు.

కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానం క్రికెట్‌ అభిమానులతో కిక్‌..రిసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌తో క్రికెట్‌ అభిమానులతో సందడి.. సందడిగా మారింది. క్రికెట్‌ ప్రేక్షకుల కోసం బీసీసీఐ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటు చేసిన ఐపీఎల్‌ లైవ్‌ మ్యాచ్‌ వీక్షణకు అశేష స్పందన లభించి ంది.గ్రౌండ్‌లో 10 వేల మందికి ఏర్పాట్లు చేయగా 20 వేల మంది మ్యాచ్‌ వీక్షించడానికి హాజరైనట్టు అంచనా. సెమీ ఫైనల్‌ లో వర్షం జాప్యం కొంచెం నిరాశ పరిచినా..ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం క్రీడా అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. పంజాబ్‌-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు తరలివచ్చి ఆనందంగా వీక్షించారు. లైవ్‌ షో వీక్షించేందుకు విచ్చేసిన క్రికెట్‌ అభిమానులకు ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను రాజ్యసభ ఎంపీ, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్‌బాబు డ్రా తీసి గెలుపొందిన చిన్నారికి కోహ్లీ సంతకంతో ఉన్న టీషర్టు అందించారు. సానా సతీష్‌బాబు మాట్లాడుతూ ఇకపై ఐపీఎల్‌ సందడి మన కాకినాడలో ఇలాగే ఉంటుందని అభిమానుల్లో జోష్‌ నింపారు. ఐపీఎల్‌ ఫైనల్‌ లైవ్‌ స్ర్కీనింగ్‌ చూసే ఏకైక ఫ్యాన్‌ పార్క్‌ కాకినాడలో ఏర్పాటు చేయడంతో చిన్నా, పెద్ద కుటుంబాలతో బాగా ఎంజా య్‌ చేశారు. లైవ్‌ మ్యాచ్‌ స్ర్కీనింగ్‌ మధ్యలో డీజే ప్లే చేయడంతో డ్యాన్సులతో అదరగొట్టారు.

Updated Date - Jun 04 , 2025 | 01:42 AM