వాడపల్లి వెంకన్న దర్శనానికి వచ్చి...
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:40 AM
ఆత్రేయపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వెంకన్న దర్శనానికి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి గోదావరిలో గల్లంతయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా వెనుసూరి మండలం లచ్చన్నగూడెంకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పామర్తి దినేష్ (22) ఆరుగురు మిత్రులతో కలిసి సత్తుపల్లి నుంచి కారులో శుక్రవారం రాత్రి
గోదావరిలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు
ఎస్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు
ఆత్రేయపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వెంకన్న దర్శనానికి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి గోదావరిలో గల్లంతయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా వెనుసూరి మండలం లచ్చన్నగూడెంకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పామర్తి దినేష్ (22) ఆరుగురు మిత్రులతో కలిసి సత్తుపల్లి నుంచి కారులో శుక్రవారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం వాడపల్లి వెంకన్న సన్నిధికి బయలుదేరా రు. శనివారం వాడపల్లికి చేరుకున్న వారు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయంలోకి సమీ పంలో ఉన్న గోదావరి నదిలో స్నానానికి దిగారు. అక్కడే ఉన్న పడవపై ఎక్కి కేరింతలు కొట్టారు. దినేష్‌కు ఈత రాకపోవడంతో అక్కడిక్కడే ముని గి గల్లంతయ్యాడు. మిత్రులతో పాటు స్థానికులు దినేష్‌ను కాపాడే ప్రయత్నంచేశారు. ఈ విషయాన్ని ఆలయ సమాచార కేంద్రం వద్దకు తెలియచేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఈవో నల్లం సూర్యచక్రధరరావు వివి ధ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. వారందరూ ఘటన స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం 16వ బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ వెం కటేష్ ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది గల్లంతైన దినేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, మిత్రులు వాడపల్లి చేరుకుని తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అక్కడికి చేరుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దినేష్ సోదరుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.
Updated Date - Jul 20 , 2025 | 12:40 AM