ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు

ABN, Publish Date - May 01 , 2025 | 01:21 AM

సీఎం చంద్రబాబు కలలకు రూపం వచ్చింది.. ప్రతి అసెంబ్లీలో ఒక పారిశ్రామికవాడ ఉండాలన్న ఆయన ఆలోచలకు నేడు తొలి బీజం పడనుంది..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో పిఠాపురం,జగ్గంపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరంరూరల్‌, కాకినాడరూరల్‌, పెద్దాపురం తొలి విడతగా పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దను న్నారు..ఈ మేరకు గురువారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

  • ఉమ్మడి జిల్లాలో మరో అడుగు

  • తొలి విడతగా ఆరు చోట్ల నిర్మాణం

  • భూములకు ఏపీఐఐసీ ఆపసోపాలు

  • అరకొరగాప్రభుత్వ భూములు

  • అయినా వీటివైపే మొగ్గు

  • నేడు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

సీఎం చంద్రబాబు కలలకు రూపం వచ్చింది.. ప్రతి అసెంబ్లీలో ఒక పారిశ్రామికవాడ ఉండాలన్న ఆయన ఆలోచలకు నేడు తొలి బీజం పడనుంది..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో పిఠాపురం,జగ్గంపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరంరూరల్‌, కాకినాడరూరల్‌, పెద్దాపురం తొలి విడతగా పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దను న్నారు..ఈ మేరకు గురువారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రా మిక రంగాన్ని పరుగులు తీయించడం కోసం ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు భూముల లభ్యత తలనొప్పిగా మారింది. ఒక్కో నియో జకవర్గంలో వందెకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే ఎక్కడా ఏపీఐఐసీకి భూములే దొరకడం లేదు. రెవెన్యూ అధికారు లకు ప్రతిపాదనలు పంపినా ఎక్కడా జాగా కని పించడం లేదు. దీంతో అరకొరగానే ఉన్న స్థలా ల్లో ఏదోలా పరిశ్రమలను ప్రోత్సహించ డానికి నానాతంటాలు పడుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆశించిన స్థాయిలో భూము ల్లేని పరిస్థితి. ఉన్నంత వరకు భూములు చేతికి వచ్చిన ఆరు నియోజకవర్గాల్లో తొలి విడత పారి శ్రామిక పార్కుల ఏర్పాటుకు నిర్ణయిం చింది. సీఎం చంద్రబాబు నేడు(గురువారం) వర్చు వల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వం ప్లగ్‌అండ్‌ప్లే విధా నంలో రూ.9.20 కోట్లతో భవనాలు నిర్మించి చిన్న కంపెనీలకు అద్దెకు ఇవ్వనుంది.

చంద్రన్న ఆదేశంతో కదలిక..

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం పూర్తిగా పడకేసింది. అప్పటి అధికార నేతల బెదిరింపులు, భూదా హంతో ఉన్న కంపెనీలు, రావాల్సిన కంపెనీలు రాకుండా పోయాయి. దీంతో యువతకు ఉద్యో గాలు లభించని పరిస్థితి. ఇదిలా ఉండగా ప్రభుత్వం మారాక సీఎం చంద్రబాబు పారిశ్రా మిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో సైతం చిన్న,మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల లభ్యత బట్టి పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు సిద్ధం చేయాలని ఏపీ ఐఐసీని ఆదేశించారు. వీటిలో ప్రభుత్వం ప్లాట్లు వేసి కంపెనీలకు కేటాయించడం, మరికొన్నిం టిలో ప్రభుత్వమే భవనాలు నిర్మించి కంపెనీ లకు ఇవ్వాలని నిర్ణయించారు.

ఆరు నెలలుగా భూజల్లెడ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏపీఐఐసీ అధికా రులు గడచిన ఆరునెలలుగా నియోజక వర్గాల్లో భూములను గుర్తించే పనిలో పడ్డారు. రెవెన్యూ అధికారులను సంప్రదించి ప్రభుత్వ భూములు ఇవ్వాలని కోరారు. కానీ ఎక్కడ చూసినా పెద్దగా ప్రభుత్వ భూములు లేని పరిస్థితి.అక్కడక్కడా ఉన్నా ఎకరం,రెండెకరాలకు మించి లేవు. దీంతో ఏంచేయాలో ఏపీఐఐసీకి తోచని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఎక్క డికక్కడ ప్రభుత్వ భూముల కబ్జా, కొన్ని చోట్ల పూర్తిగా జగనన్న కాలనీలకు లాగేసుకోవడంతో ఎక్కడా భూములు లేవు. దీంతో ఏం చేయాలో తెలియక ఉన్న అరకొర భూములనే ఇవ్వాలని ఏపీఐఐసీ రెవె న్యూ అధికారులను కోరింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం పారిశ్రా మిక పార్కులకు 404 ఎకరాలే ఉన్నట్టు తేలింది. దీంతో ఏపీఐఐసీ తలపట్టుకుంటోంది. ఇంత తక్కువ భూమిలో పారిశ్రామికపార్కుల ఏర్పా టు ఎలాగో అర్థంకాక గింజుకుంటోంది. పోనీ ప్రైవేటుగా సేకరించాలంటే వందల కోట్ల లో ఖర్చు కానుంది. దీంతో పారిశ్రామిక పార్కు ల ఏర్పాటు కష్టతరంగా మారిన విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లింది.

తొలుత ఆరుచోట్లే...

కావాల్సినంత భూముల లభ్యత లేకపో వడం, అరకొర ఉన్న చోట ఇప్పటికీ ఆ భూము లను రెవెన్యూ అధికారులు ఏపీఐఐసీకి అప్ప గించకపోవడంతో ఏపీఐఐసీ చేతులెత్తేసింది. దీంతో మే 1న నేడు సీఎం చంద్రబాబు ద్వారా వర్చువల్‌గా వీటికి శంకుస్థాపన చేసే అవ కాశం లేకపోవడంతో వాటిని పక్కన పడేసింది. ప్రస్తుతం చేతికి భూములు వచ్చిన పిఠాపురం, జగ్గంపేట, రామచంద్రపురం,పెద్దాపురం, కాకి నాడరూరల్‌,రాజమహేంద్రవరంరూరల్‌ నియో జకవర్గాల్లోనే తొలి విడత కింద పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ నిర్ణ యించింది.వీటిలో రూ.9.20కోట్లతో చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రభుత్వమే కార్యాల యాలు నిర్మించి అద్దెకు కేటాయించనుంది. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో వీటిని అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మించి కంపెనీలకు కేటాయిస్తుంది. నేరుగా కంపెనీలు ఇందులో ఏ ఇబ్బంది లేకుండా కార్యకలాపాలు ప్రారంభించ వచ్చు.ఈ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఏపీఐఐసీ నివేదిక పంపింది. రాజమహేంద్రవరం రూరల్‌ నియో జకవర్గంలో భూముల్లేకపోవడంతో ఏపీఐఐసీకి కల్వచర్లలో సొంతంగా ఉన్న 104 ఎకరాల్లో ప్లాట్లను పరిశ్రమలకు కేటాయించేలా త్వరలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ లేఅవుట్‌కు సీఎం చంద్రబాబు నేడు వర్చువల్‌ గా శంకుస్థాపన చేస్తారు.కాకినాడ రూరల్‌, పెద్దాపురంలోను భూముల్లేవు. ఉన్న కొద్దిపాటి ఏపీఐఐసీ భూముల్లో సదుపాయాలు కల్పించా లని నిర్ణయించారు.వీటికి కూడా సీఎం నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏపీఐఐసీ భూ ములు మినహాయిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం పిఠాపురం, జగ్గంపేట, రామ చంద్రపురం నియోజకవర్గాల్లోనే సీఎం ఇండస్ట్రి యల్‌ పార్కుల ఏర్పాటుకు వర్చువల్‌ శంకు స్థాపన చేయనున్నారు. మిగిలిన నియోజక వర్గాల్లో ప్రభుత్వ భూముల లభ్యత అసలు లేకపోవడం, ఉన్న అరకొర విస్తీర్ణం ఎప్పటికి రెవెన్యూ అధికారులు ఏపీఐఐసీకి అప్పగిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

పరిశ్రమలు ఇక్కడే..

కాకినాడ జిల్లా పిఠాపురంలో 4.05 ఎకరాలు, కాకినాడరూరల్‌ వాకలపూడిలో ఏపీఐ ఐసీకి ఉన్న 2.99 ఎకరాలు, పెద్దాపురంలో 27 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. జగ్గం పేటలో 1.81 ఎకరాలు మాత్రమే గుర్తిం చారు. గండేపల్లిలో 3.39 ఎకరాలు, ప్రత్తి పాడు మండలం శంఖవరంలో 2.82 ఎక రాలు, తుని హంసవరంలో ఏడెకరాలు ప్రభుత్వ భూములు ఉన్నట్టు అధికా రులు తేల్చారు. కాకినాడ జిల్లాలో ఏడు నియో జకవర్గాలకు 700 ఎకరాలు కాకపోయినా 400 ఎకరాలైనా ఉంటే చాలని అధికారులు భావిస్తే 49.06 ఎకరాలు గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియో జకవర్గం రంగంపేటలో 8.90 ఎకరాలు గుర్తించారు.రాజమహేంద్రవరంలో సెంటూ కూడా లేదు.రాజానగరంలోని కోరుకొండలో 12.50 ఎకరాలు, రాజమహేంద్రవరం రూరల్‌ నిడిగట్లలో 12.50 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్క కొవ్వూరులోని తాళ్లపూ డిలో 271 ఎకరాలు ఉన్నాయి. నిడదవో లులో సెంటు కూడా దొరకలేదు. గోపాల పురంలో 13.22 ఎకరాలు గుర్తించారు. తూ ర్పుగోదావరి జిల్లాలో 318 ఎకరాలు ఉన్న ట్టు తేలింది.ఇందులో 80 శాతం భూము లు కొవ్వూరులోనే ఉన్నాయి.

కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, రాజోలు, గన్నవరం నియోజకవర్గాల్లో సెంటూ కూడా దొరకలేదు. రామచంద్రపురంలోని ద్రాక్షారామలో 3.99 ఎకరాలు, అమలాపురంలోని ఉప్పలగుప్తంలో 6.83 ఎకరాలు, మండపేటలోని కేశవరంలో 24.84 ఎకరాలు, కొత్తపేటలో 1.16 ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు ఏపీ ఐఐసీకి నివేదిక పంపారు. కోనసీమ జిల్లాలో మొత్తం 36.82ఎకరాలు ఉన్నట్లు తేల్చారు.

Updated Date - May 01 , 2025 | 01:21 AM