తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు
ABN, Publish Date - Apr 29 , 2025 | 01:08 AM
ప్రస్తు త వేసవిలో మండలంలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు.సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా విచ్చే సి మాట్లాడారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రంగంపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రస్తు త వేసవిలో మండలంలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు.సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా విచ్చే సి మాట్లాడారు. వేసవి ప్రారంభమైందని, రంగంపేట మండలం మెట్ట ప్రాంతం కావడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదముందని, ముందు జాగ్రత్తగా చర్య లు చేపట్టాలన్నారు. గ్రామాల వారీ గా సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. సుభద్రంపేటలో ఏర్పాటు చేసిన బోరుకు కరెంట్ లేక మోటారు వేయలేదని చెప్పగా తక్షణమే పంచాయతీ నిధుల నుం చి రూ.1.60 లక్షలు ట్రాన్స్‌ఫార్మర్‌కి డీడీ తీయాలన్నారు. చినదొడ్డిగుంటలో బోరు పోయిందని, సింగంపల్లిలో వాటర్ ట్యాంక్ పిల్లర్స్ శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేపట్టడం లేదా కొత్తవాటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. రంగంపేటలో వాటర్ ట్యాంక్‌కు అవుట్‌ఫుట్ పైపులైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రంగంపేట, వెంకటాపురం, సింగంపల్లి, నల్లమిల్లి గ్రామాలకు చెందిన నలుగురికి ఎంజీఎన్‌ఆర్‌జీఈఎస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ నియామక పత్రాలను ఎమ్మెల్యే అందించారు. ఇదిలా ఉండగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు సోదరుడు టీడీపీ నాయకుడు ఆళ్ల సత్యనారాయణ(బాబి) పుట్టినరోజు సం దర్భంగా వడిశలేరులో గోవిందు నివాసం వద్ద ఎమ్మెల్యే నల్లమిల్లి కేక్ కట్‌చేసి బాబికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమాల్లో ఆళ్ల గోవిందు, ఎం పీడీవో సాయిబాబు, డీఎంపీడీవో వెంకటరత్నం, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 01:08 AM