పుట్టగొడుగులు.. అక్రమ లేఅవుట్లు..
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:53 AM
గోకవరం మండలంలో అక్రమ లేఅవుట్ల దందా నడు స్తోంది. కనీస అనుమతులు పొందకుండా, ప్ర భుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసా రంగా లేఅవుట్లు వేసి ప్లాట్ల అమ్మకాలు సాగి స్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులే నోరు మెదపక పోవడంతో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది.
కనీస అనుమతులు ఉండవు
ప్రభుత్వ నిబంధనలు పాటించరు
గోకవరంలో ఇష్టానుసారంగా వెంచర్లు
గోకవరం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): గోకవరం మండలంలో అక్రమ లేఅవుట్ల దందా నడు స్తోంది. కనీస అనుమతులు పొందకుండా, ప్ర భుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసా రంగా లేఅవుట్లు వేసి ప్లాట్ల అమ్మకాలు సాగి స్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులే నోరు మెదపక పోవడంతో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. అనుమతులు లేని లేఅవు ట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు గృహలు నిర్మించుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మారాలంటే మా ర్కెట్ విలువకు తగ్గట్టుగా ప్రభుత్వానికి రుసు ము చెల్లించాలి. ఆ రసీదుతో రెవెన్యూ అధికా రులకు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు వస్తాయి. ఇవేవీ పాటించకుండా అక్రమార్కులు క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు.
నిబంధనలకు తూట్లు:
లేఅవుట్లు వేస్తున్న వ్యాపా రులు నిబంధనలు పాటించ డం లేదు. భూమిని లేఅవు ట్లుగా మార్పు చేసినట్టు రెవె న్యూ అధికారుల నుంచి అ నుమతి పొందాలి, ఆ తర్వా త పంచాయతీ అనుమతి పొందాలి. లేఅవుట్లలో రహదారులు, డీటీసీపీ అనుమతి, విద్యుత్ సౌక ర్యం, తాగునీరు, మౌలిక వసతుల కోసం కొంత మేర స్థలం కేటాయించాల్సి ఉంది. ఇవేమీ లేకుండానే పనులు కానిస్తున్నారు. రూ.లక్షలతో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి అను మతులు లేకుండా లేఅవుట్లు వేసి రూ.కోట్ల విలువ చేసే భూమిగా మారుస్తున్నారు. భూమి ని కొనుగోలు చేసిన వెంటనే ప్రైవేట్ సర్వేయ ర్లతో కుమ్మక్కై భూములను లే అవుట్లుగా మారుస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో అనుమతులులేని లేఅవుట్లను పంచాయతీ అధికారులు గుర్తించి వాటిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే రెండు, మూడు రోజుల్లో ఆ బోర్డులు కనిపించకుండాపోయాయి. గోకవరంలో అధికా రికంగా 8 లేఅవుట్లు ఉండగా, అనధికారికంగా 9, కొత్తపల్లిలో సుమారు మూడు అనధికార లేఅవుట్లు ఉన్నట్టు సమాచారం.
Updated Date - Jun 08 , 2025 | 12:53 AM