పేదింటికి గడువు!
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:21 AM
సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పేదలు భారీగా ప్రభుత్వానికి దరఖాస్తులు చేశారు. వేలాది మంది సచివాలయాల ద్వారా వినతులు అందిం చారు.
సొంతింటికి దరఖాస్తుల వెల్లువ
ఉమ్మడి జిల్లాలో 44,354
కాకినాడలో అత్యధికం 18,500
కోనసీమ జిల్లా 13,754
తూర్పుగోదావరి 12,200
95 శాతం మందికి సొంత స్థలమే
ఇప్పటికే వడపోత వేగవంతం
తహశీల్దార్ల పొజిషన్ సర్టిఫికెట్లు
కేంద్రం నుంచి అనుమతులు
ఇంటికి రూ.2.50 లక్షల సాయం
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పేదలు భారీగా ప్రభుత్వానికి దరఖాస్తులు చేశారు. వేలాది మంది సచివాలయాల ద్వారా వినతులు అందిం చారు. తమకు సొంత స్థలం ఉందని, ఇంటి నిర్మాణానికి సాయం చేయాలంటూ విన్న విం చారు. ఇలా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 44,354 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18,500 మంది ఉన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 13,754, తూర్పుగోదావరిలో 12,200 దరఖాస్తులు వెల్లువె త్తాయి. మరో పది రోజుల్లో దరఖాస్తుల దాఖ లుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకో నాలుగు వేల మంది వరకు వినతులు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరో పక్క ఉమ్మడి జిల్లాలో నగరాభివృద్ధి సం స్థల పరిధిలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నివాసం ఉంటూ సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దాదాపు ఇళ్లు మంజూరైన ట్లేనని అధికారులు చెబుతున్నారు. నగరాలు, పట్టణాల పరిధిలో ఇళ్లకు కేంద్రం నేరుగా ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నందున లబ్ధిదారులకు వేగంగా నిధులు రానున్నాయి.
నెలాఖరు వరకూ అవకాశం..
పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. సచి వాలయాల ద్వారా గతేడాది నవంబరు ఆఖరు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొంత స్థలం ఉన్న వారి ని లబ్ధిదారులుగా ఎంపిక చేసి నిధులు మం జూరు చేస్తామని తెలిపింది.ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 43,737 మంది దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారులు తేల్చారు.అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో 3 వేలు, గోపాలపురం 1600,రాజానగరం మండలంలో 1,200 మంది వరకు పేదలు దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికం గా కాట్రేనికోన మండలంలో 1,024,ఉప్పలగు ప్తం 1,006, ఐ.పోలవరం 904, అయినవిల్లి 859, అంబాజీపేట 850, అమలాపురం 846, అత్యల్పంగా మండపేటలో 67 దరఖాస్తులు వచ్చాయి.కాకినాడ అర్బన్ పరిధిలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి.ఈ నెలాఖరుతో దర ఖాస్తుల గడువు ముగియనుంది.
పట్టణ ఇళ్లకు ఢోకా లేదు..
ఉమ్మడి జిల్లాలో కుడా, రుడా, అముదా పరి ధిలోకి వచ్చే దరఖాస్తులకు సంబంధించి అర్హు లకు దాదాపు ఇళ్లు మంజూరైనట్లేనని అధికా రులు చెబుతున్నారు. వీటి పరిధిలో ఇళ్లకు పూర్తిగా కేంద్రమే నిధులు ఇవ్వనుంది. దీంతో నిధుల సమస్య వచ్చే అవకాశం లేదు. అటు గ్రామీణప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు ఎక్కువగా అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వీటి మంజూరుకు సైతం అధికా రులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
95 శాతం స్థలం ఉన్నవారే..
దరఖాస్తుదాల్లో 95 శాతం మంది తమకు సొంతంగా ఇంటి స్థలాలు ఉన్నట్టు ప్రస్తావించా రు. ఈ నేపథ్యంలో వీరికి సొంత స్థలం ఉన్నట్టు ఆయా మండలాల తహశీల్దార్లతో పరిశీలించి పొజిషన్ సర్టిఫికెట్లను అధికారులు తీసుకుంటు న్నారు. ఇప్పటికే సగానికిపైగా దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ముగిసింది. మరో పక్క వచ్చిన దరఖాస్తుల్లో నిబంధనల ప్రకారం ఉన్న వాటిని లబ్ధిదారుల యాప్‌లో అధికారులు నమోదు చేస్తున్నారు. గతంలో వీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వం నుంచి స్థలం లేదా ఇళ్లు పొంది ఉన్నారా? లేదా? అనేది గుర్తించే ప్రక్రి య త్వరలో మొదలు పెట్టనున్నారు. అర్హుల జాబితాకు సంబంధించి వడపోత పూర్తయితే వాటిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ వెబ్‌సైట్‌లోను పట్టణం, గ్రామీణ ప్రాంతం విభాగంలో అప్ లోడ్ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న ఒక్కో లబ్ధిదారుడు పథకానికి అర్హత సాధిస్తే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేయనుంది.ఇందులో కేంద్రం వాటా రూ.1.50 లక్షలు. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉంటే సాధ్యమైనంత వేగంగా పథకం పు రోగతి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుదారులు భారీగా క్యూకట్టడంతో వేగం గా ఇళ్ల నిర్మాణాలు సాగేలా కనిపిస్తున్నాయి.
నాడంతా అస్తవ్యస్తం
వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పేదలను నిలువునా ముంచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.06 లక్షల మందిని పేదల ఇళ్లస్థలాలకు అర్హులుగా గుర్తించింది. వీరందరికీ 7,610 ఎకరాలు అవసరమవుతాయని నిర్ధారించారు.రెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలిన 5,610 ఎకరాల ప్రైవేటు భూములను రూ.2,200 కోట్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే పే దల ఇళ్లస్థలాలకు అనువైన ప్రాంతాలు కాకుం డా కేవలం స్థానిక అధికార పార్టీ నాయకుల కు ఆర్థికంగా కలిసి వచ్చే.. ఎందుకూ పనికి రాని భూములను అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఆయా స్థలాల్లో 1,540 వరకు లేఅ వుట్లు వేశారు.ఇందులో వెయ్యికిపైగా లేఅవుట్ల వరకు వర్షాలకు తరచూ నిండా మునిగిపోయే వి.150 ఎకరాల కరప సెంట్రల్ లేఅవుట్ దగ్గర నుంచి,జగన్ ప్రారంభించిన కొమరగిరి లేఅవు ట్,రాజమహేంద్రవరానికి సమీపంలోని ఆవ భూములు,మండపేట, రామచంద్రపురం, కడియం, పిఠాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, కాకినాడ, పెద్దాపురం, జగ్గంపేట, గోకవరం,పెదపూడి ఇలా అనేక మండలాల్లో మునిగిపోయి న పరిస్థితి.వీటిలోనే లబ్ధిదారులు తమకు ఇచ్చి న పట్టాల్లో ఇళ్లు కట్టుకోవాలని ప్రభుత్వం ఒత్తి డి తెచ్చింది.గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పథ కం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆ తప్పులు లేకుండా అధికారులు పథకాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.లబ్ధిదారు లం తా ఇళ్లు కట్టుకునేలా పర్యవేక్షించనున్నారు.
Updated Date - Apr 21 , 2025 | 12:21 AM