పేదింటి బాట!
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:22 AM
పేదల ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ నెల 12వ తేదీకి జిల్లాలో చాలా మంది పేదల సొంతింటి కల నెరవేర్చి గృహ ప్రవేశాలు చేయించాలనే మంచి ఆలోచనతో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది.
12న సామూహిక ఇళ్ల నిర్మాణాలు?
ప్రారంభానికి అధికారుల సన్నాహాలు
కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
గత ప్రభుత్వ నిర్వాకంపై నివేదిక
1.70 లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీ
ఉమ్మడి జిల్లాలోనే ఇదీ లెక్క
రద్దు చేసే యోచనలో సర్కారు?
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
పేదల ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ నెల 12వ తేదీకి జిల్లాలో చాలా మంది పేదల సొంతింటి కల నెరవేర్చి గృహ ప్రవేశాలు చేయించాలనే మంచి ఆలోచనతో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది.సీఎం చంద్రబాబు పేదల ఇళ్ల నిర్మాణ కల సాకారం చేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ లేఅవుట్లలో మఽధ్యలోనే నిలిచిపోయిన పేదల ఇళ్లకు ఆర్థిక సాయం అందించి పూర్తి చేయడం, సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.అందులో భాగంగా ఈనెల 12న సామూహిక ఇళ్ల ప్రార ంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. కోనసీమ జిల్లా లో 6,300 ఇళ్లు, కాకినాడ జిల్లాలో 6వేల వరకు ప్రారంభించనున్నారు. కోనసీమలో ద్రాక్షారామ లోని వెలం పాలెం లేఅవుట్, కాకినాడలోని కరప మండలం వేలంగిలో సామూహిక ఇళ్లను ప్రారంభించనున్నారు. సొంత స్థలాలు ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేలా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తుదారుల వివరాలను కేంద్రప్రభుత్వ హౌసింగ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసి అనుమతులు ఇవ్వనున్నారు.
ఖాళీ స్థలాలపై సీఎం దృష్టి..
ప్రభుత్వం మారడంతో వీటిపై సీఎం చంద్ర బాబు దృష్టిసారించారు. వేల కోట్లు వెచ్చించిన లే అవుట్ల పరిస్థితిపై కలెక్టర్ల ద్వారా నివేదిక సిద్ధం చేయిస్తున్నారు.ఈ మేరకు ఉమ్మడి జిల్లా లోని లే అవుట్లలో 1.70 లక్షల స్థలాలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో 1.06 లక్షల స్థలాలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని తేల్చారు. ఇందులో కొమర గిరి, కరప, రౌతులపూడి, తుని, కోటనందూరు, ఏలేశ్వరం,తాళ్లరేవు తదితర మండలాల్లో లేఅ వుట్లు ఉన్నట్టు గుర్తించారు. కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 64 వేల వరకు స్థలాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ఇందులో అసలే మాత్రం పనికిరానివి ఎన్ని? శ్మశానాల పక్కన ఉన్నవి ఎన్ని అనేది సైతం త్వరలో తేల్చబోతు న్నారు.దీని ఆధారంగా పట్టాలు రద్దు చేస్తారు.
నాడు జగన్ ఆరంభించినా..
నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు పేరుతో అప్పటి జగన్ ప్రభు త్వం 2020 డిసెంబర్ 25న పథకం ప్రారం భించింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లా లోని పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలోని కొమరగిరిలో అప్పటి సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కాకినాడ నగరానికి చెందిన 16 వేల మంది లబ్ధిదారులకు పిఠాపురం నియో జకవర్గం యు.కొత్తపల్లి మం డలంలోని కొమరగిరిలో 250 ఎకరాలు కొను గోలు చేశారు. ఇక్కడ సైతం ఇళ్ల నిర్మాణం పాతిక శాతం కూడా పూర్తికాలేదు.పైగా ఇక్కడ అప్పటి సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించగా, పూర్తిగా విఫలమైంది. ఇలా ఎక్కడికక్కడ ఉమ్మడి జిల్లాలో అనేక లేఅవుట్లు ఇళ్ల నిర్మాణం జరగక దిష్టిబొమ్మల్లా మారాయి.
నాడు 3.84 లక్షల మంది ఎంపిక..
ఉమ్మడి జిల్లాలో సొంతిళ్లు లేని 3.84 లక్షల మందిని పథకానికి ఎంపిక చేశారు. తొలివిడత కింద ఉమ్మడి జిల్లాలో 1.53 లక్షల మందిని గుర్తిం చారు.ఈ మేరకు 7,218 ఎకరాలు అవసరం కాగా 1,856 ఎకరాల ప్రభుత్వ భూమి అందు బాటులో ఉన్నట్టు గుర్తిం చారు. దీంతో 5,362 ఎకరాల ప్రైవేటు భూములను ఇళ్ల స్థలాలకు సేకరించారు.ఇందుకు ఏకంగా రూ.2,566 కోట్లు ఖర్చు చేశారు.నాడు ఒక్కో అధికార పార్టీ ఎమ్మెల్యే అప్పట్లో కోట్లలో మెక్కేశారు. ఎకరం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు ముందే కొనుగోలు చేసి అవే భూములను తమ పలు కుబడితో రూ.42 లక్షల చొప్పున ప్రభుత్వానికి అంటగట్టి జేబులు నింపేసుకున్నారు. ఇలా సేకరించిన ఇళ్లస్థలాలు అసలు ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేవని అప్పట్లో లబ్ధిదారులు పెదవి విరిచినా పట్టించుకోలేదు.ఒక్క కాకినాడ జిల్లాలోనే 359 లేఅవుట్లలో 77,896 ఇళ్లు నిర్మించి తీరాల్సిందే నని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో 321 లేఅవు ట్లలో 68 వేల ఇళ్లు కట్టించాలని భావించారు. లేఅవుట్లు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో లబ్ధిదారులు అసలు కన్నెత్తి చూడలేదు.
‘తూర్పు’న లెక్క ఇలా..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
తూర్పుగోదావరి జిల్లాలో 10,794 పేదల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా యం త్రాంగం పని చేస్తోంది.ఈ మేరకు కలెక్టర్ పి.ప్రశాంతి టార్గెట్ నిర్ణయించి ఆయా లేఅవుట్ల వారీ ప్రత్యేకాఽధికారులను నియమించి పనులు పరుగులు పెట్టిస్తున్నారు.ఇప్పటి వరకూ 5957 ఇళ్లు పూర్తయ్యాయి.ఇంకా 4837 ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో ఉంది.ఈ నెల 7వ తేదీకి మరో 2419 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.ఇప్పటికి అందులో 62 పూర్తి చేశారు. ఇంకా జిల్లాలో 310 ఆర్‌సీ లెవల్, 1144 రూఫ్ లెవల్‌లో ఉన్నాయి.వాటిని ముందుగా పూర్తి చేసే ఆలో చన ఉంది. బేస్‌మెంట్ లెవల్‌లో 5714, లింటల్ లెవల్‌లో 2193 ఉన్నాయి.అవిప్పుడే పూర్తయ్యే అవకాశం లేదు. ఇళ్ల నిర్మాణ లక్ష్యాలతో ముందుకు వెళ్లే అధి కారులకు కొన్ని ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతున్నారు.
తూర్పున మండలాల వారీ ఇలా..
రాజమండ్రి అర్బన్‌కు చెందిన 3096 ఇళ్లను వెలుగుబందలో నిర్మించడం లక్ష్యంగా పెట్టుకు న్నారు. ఇప్పటికే 2327 పూర్తయ్యాయి. ఇది 75 శాతం.769 పెండింగ్‌లో ఉన్నాయి. అనపర్తిలో 685 లక్ష్యం కాగా 156 పూర్తయ్యాయి. ఇది 23 శాతం. బిక్కవోలులో 695 లక్ష్యంకాగా 197 పూర్తయ్యాయి.28 శాతం. కొవ్వూరులో 460కి 149 పూర్తి.ఇది 32 శాతం. సీతానగరంలో 269కి 88 పూర్తి ఇది 33శాతం. చాగల్లులో 385కి 132 పూర్తి ఇది 34 శాతం. కొవ్వూరు అర్బన్‌లో 595కి 209 పూర్తి ఇది 35శాతం . రాజమండ్రి రూరల్‌లో 295కి 105 పూర్తి ఇది 36 శాతం. ఉండ్రాజవరంలో 306కి 121 పూర్తి ఇది 40 శాతం. రంగంపేటలో 304కి 123 పూర్తి ఇది 40శాతం. నిడదవోలు అర్బన్‌లో 223కి108 పూర్తి. ఇది 48 శాతం. కడియంలో 219కి 108 పూర్తి ఇది 49శాతం. తాళ్లపూడిలో 284కి 151 పూర్తి ఇది 53 శాతం. పెరవలిలో 138కి 80 పూర్తి ఇది 58 శాతం. రాజాన గరంలో 289కి 178 పూర్తి ఇది 62శాతం. కోరుకొండలో 266కి 165 పూర్తి ఇది 62శాతం. గోకవరంలో 211కి 131 పూర్తి ఇది 62 శాతం. నిడదవోలులో 388కి 212 పూర్తి ఇది 63శాతం. దేవరపల్లిలో 699కి 476 పూర్తి ఇది 68 శా తం. నల్లజర్లలో 563కి 399 పూర్తి ఇది 71 శాతం. గోపాలపురంలో 474కి 342 పూర్తి. ఇవి 72శాతం.
Updated Date - Jun 06 , 2025 | 01:22 AM