సాయి ఆలయానికి రూ. కోటి విలువైన ఇల్లు
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:47 AM
ఆ దంపతులు సాయిబాబా భక్తులు.. అందుకే వారింటికి కూడా సాయి కుటీరం అనే పేరు పెట్టుకున్నారు.
కొవ్వూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ఆ దంపతులు సాయిబాబా భక్తులు.. అందుకే వారింటికి కూడా సాయి కుటీరం అనే పేరు పెట్టుకున్నారు..చివరికి ఆ ఇల్లు సాయి బాబా ఆలయానికే చెందాలని తలంచారు. అలాగే వీలునామా రాశారు. ఆ దంపతుల బంధు వులు ఆదివారం ఆ వీలునామా సాయిబాబా ఆల యానికి ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన న్యాయవాదులు పడాల భానుప్రసాద్, గంధం విజయశ్రీ దంపతులు. విజయశ్రీ కొవ్వూరు బార్ అసోసియేషన్‌లో ప్రథమ మహిళా న్యాయవాదిగా 1974లో నమోదయ్యారు. అనంతరం ఏపీపీగా బాధ్యతలు నిర్వహించారు. భానుప్రసాద్ ఏడేళ్ల కిందట మరణించగా.. 2025 జూన్ 22వ తేదీన విజయశ్రీ మరణించారు.ఆమె చనిపో వడానికి ముందే 256 గజాల్లో కట్టుకున్న సుమారు రూ.కోటి విలువ చేసే తమ ఇం టిని కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని సాయి బాబా ఆలయానికి వీలునామా రాసి న్యాయ వాది దొండపాటి కృష్ణారావుకు అందజేశారు. ఇంటికి సంబంధించిన పత్రాలను ఆదివా రం న్యాయవాది కృష్ణారావు,విజయశ్రీ కుటుం బీకులు, భక్తులు, పెద్దల సమక్షంలో షిరిడి సాయినాథ్ ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్ట్ సభ్యుడు గుడివాక శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు వర్రే నాగమురళీకృష్ణ, న్యాయవాదులు నరుకుల హనుమంతరావు, బాలదారి రమేష్, వీరంశెట్టి రాజా వరప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మట్టే ప్రసాద్, ట్రస్టు సభ్యులు కసిరెడ్డి సీతారామ య్య, సిహెచ్.సుబ్బారావు,బి.సురేష్, ఎ.రాం బాబు,సిహెచ్.గణేష్ పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:47 AM