పల్లంలో హెపటైటిస్ కలకలం
ABN, Publish Date - Apr 06 , 2025 | 12:39 AM
కాట్రేనికోన, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో కాలేయ వ్యాధులు ప్రబలుతున్నాయన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరు వైద్య బృందాలు శనివారం గ్రామంలో హెపటైటిస్ బీ,సీ పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరు వేల మందికి పరీక్షలు నిర్వహించవలసి ఉండగా శనివారం 2వేల మందిని పరీక్షించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు.
రక్త నమూనాలు సేకరించిన వైద్యులు
200మందికి రాపిడ్ టెస్ట్‌ల్లో పాజిటివ్
కాట్రేనికోన, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో కాలేయ వ్యాధులు ప్రబలుతున్నాయన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరు వైద్య బృందాలు శనివారం గ్రామంలో హెపటైటిస్ బీ,సీ పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరు వేల మందికి పరీక్షలు నిర్వహించవలసి ఉండగా శనివారం 2వేల మందిని పరీక్షించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వారిలో 200మందికి రాపిడ్ టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చిందన్నారు. వారి రక్త నమూనాలను అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో పరీక్షించి రోగ నిర్ధారణ చేస్తామన్నారు. అవసరమైన వారికి వైద్యం చేస్తామన్నారు. రూ.6వేలు ఖర్చయ్యే వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని, గ్రామంలో అందరూ ఈ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు. హెపటైటిస్-సీ వైరస్ వల్ల కలిగే లివర్ వ్యాధి అని వైద్యాధికారిణి లిఖిత అన్నారు. రక్తం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కాలేయ కేన్సర్‌కు దారితీస్తుందన్నారు. ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాల వినియోగం, సురక్షితం కాని వైద్య పద్ధతులు, తిరునాళ్ళలో పచ్చబొట్లు వేయించుకోవడం, బహుళ భాగస్వాములతో లైంగిక సంపర్కం ఈ వ్యాధికి కొన్ని కారణాలుగా చెప్పారు. ఆలింగనం, ముద్దు, ఆహారం, నీరు ద్వారా ఈ వ్యాధి సోకదన్నారు. ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్‌గా వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు మందులున్నాయని వైద్యాధికారిణి తెలిపారు.
Updated Date - Apr 06 , 2025 | 12:39 AM