భానుడి మంటలు..వరుణుడి చల్లదనం!
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:29 AM
వాతావరణం దోబూ చులాడుతోంది.. పగలు ఎండ దంచేస్తోంది..రాత్రయ్యేసరికి వరుణుడు వచ్చేసు ్తన్నాడు..గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి..
రాజమహేంద్రవరం సిటీ,ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): వాతావరణం దోబూ చులాడుతోంది.. పగలు ఎండ దంచేస్తోంది..రాత్రయ్యేసరికి వరుణుడు వచ్చేసు ్తన్నాడు..గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి..ఉదయం నుంచి సాయంత్రం వరకూ జిల్లాలో ఎండలు చూస్తే మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుతున్నాయి.రాజమహేంద్రవరంలో మంగళవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.గత పదిరోజులుగా 40 నుంచి 41 మధ్య ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి.. భానుడి దెబ్బకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చల్లదనం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది ఉదయం నుంచి రాత్రి ఏసీ గదుల్లో సేదతీరుతున్నారు. అయితే గత రెండు రోజులుగా సాయంత్రం అయ్యే సరికి వరుణుడు చల్లబరిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ఆకాశం మేఘావృతమై నగరం చల్లబడింది.రాత్రి 7 గంటలకు వర్షం ప్రారంభమై సుమారు గంట పాటు కురిసింది. దీంతో నగరంలో ఉదయం నుంచి ఎండవేడిమితో విలవిల్లాడిన ప్రజలు వానతో సేదతీరారు. మెయిన్ రోడు, గోకవరం బస్టాండ్, కంబాలచెరువు, కోరుకొండ రోడ్డు, పేపరుమిల్లురోడ్డు, స్టేడియం రోడ్డు, కోటిపల్లి బస్టాండ్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు పోటెత్తింది.బుధవారం ఎండతీవ్రత పెరుగుతుందని జనం భయపడే పరిస్ధితి ఉంది.
Updated Date - Apr 30 , 2025 | 12:29 AM