ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గౌరీపట్నంలో ప్రారంభమైన నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలు

ABN, Publish Date - Mar 23 , 2025 | 12:12 AM

దేవరపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నంలో నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేరీమాత మహోత్సవాల సందర్భంగా ఏలూరు ఫీఠాధిపతి పొలిమేర జయరావు పుణ్యక్షేత్రం అఖండ దేవాలయంలో ఏర్పాటు చేసిన బైబిల్‌ ప్ర

మేరీ మాత మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పీఠాధిపతి జయరావు తదితరులు

దేవరపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నంలో నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేరీమాత మహోత్సవాల సందర్భంగా ఏలూరు ఫీఠాధిపతి పొలిమేర జయరావు పుణ్యక్షేత్రం అఖండ దేవాలయంలో ఏర్పాటు చేసిన బైబిల్‌ ప్రదర్శనను తిలకించారు. నూతనంగా భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. నిర్మలగిరి మేరీ మాత మందిరం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనం తరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ యావత్‌ ప్రపంచం సుఖ శాంతులతో ఉండాలనేదే మేరీమాత తల్లి ఆకాంక్ష అని పేర్కొ న్నారు. గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు గత 40 ఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మ కంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు ప్రేమ, దయ గుణం కలిగి ఉండాల న్నారు. సుఖజీవనం గడపాలని, సుఖశాంతులు అష్టఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన లు చేయడం జరుగుతుందని తెలిపారు. మతాలు, ప్రాంతాలకతీతంగా ఈ ఉత్సవాలు నిర్వహించగా భక్తులు పాల్గొనడం ప్రత్యేకత అన్నారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పుణ్య క్షేత్ర డైరెక్టర్‌ జాన్‌పీటర్‌, పాదర్లు బాల, ప్రసాద్‌, నిర్మలగిరి పుణ్యక్షేత్ర అన్నదాన కాంట్రా క్టర్‌ కళ్ళే నాగేశ్వరరావు, పలువురు ఫాదర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:12 AM