ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

22 నుంచి గౌరీపట్నంలో నిర్మలగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:02 AM

దేవరపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్ర మహో త్సవాలు ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వ హించనున్నట్టు పుణ్యక్షేత్ర డైరెక్టర్‌ జాన్‌పీటర్‌, ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు తెలి పారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో జయ రావు మట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతా లకతీతంగా నిర్మలగిరి పుణ్యక్షేత్రం ప్రణవిల్లుతు ందన్నారు. పుణ్యక్షేత్రం ప్రారంభించి 40 ఏళ్లు

మహోత్సవాల పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు

దేవరపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్ర మహో త్సవాలు ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వ హించనున్నట్టు పుణ్యక్షేత్ర డైరెక్టర్‌ జాన్‌పీటర్‌, ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు తెలి పారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో జయ రావు మట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతా లకతీతంగా నిర్మలగిరి పుణ్యక్షేత్రం ప్రణవిల్లుతు ందన్నారు. పుణ్యక్షేత్రం ప్రారంభించి 40 ఏళ్లు అయ్యిందని, 2000 సంవత్సరంలో నిర్మలగిరి క్షేత్రంలో ప్రధాన దేవాలయం నిర్మించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది సిల్వర్‌ జూబ్లీ నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, చిన్నారులు, వృద్ధులకు పాలు, మజ్జిగ అందజే స్తామన్నారు. పుణ్యక్షేత్రంలో నితాన్నదానం జరుగుతుందన్నారు. భక్తులకు శాంతి కలగడా నికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, పుణ్యక్షేత్రం సందర్శించిన భక్తులందరికీ ధైర్యం, మనశ్శాంతి కలుగుతాయన్నారు. ఉత్సవాల నిర్వ హణకు 250మంది వలంటీర్లను ఏర్పాటు చేశా మని, పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహిస్తారని, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పుణ్యక్షేత్ర సందర్శనకు ఉభయ రాష్ర్టాల నుంచి పదిలక్షల వరకు భక్తులు వస్తారని తెలిపారు. జయరావు ను జాన్‌పీటర్‌, నితాన్నదాన కాంట్రాక్టర్‌ కళ్ళే పల్లి నాగేశ్వరరావు సత్కరించారు. రెవరెండ్‌ ఫా దర్లు పీ.బాల, డీ.ఆరోన్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:02 AM