ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్రీపి కబురు!

ABN, Publish Date - May 18 , 2025 | 12:59 AM

రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై స్పష్టత ఇచ్చి ంది..

మహిళలకు తీన్‌మార్‌

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు

25.50 లక్షల మందికి ప్రయోజనం

బడులు తెరిచేలోగా తల్లికి వందనం

ఇప్పటికే విద్యార్థుల జాబితా సిద్ధం

16.51 లక్షల తల్లులకు డబ్బులు

మూడు సిలిండర్లకు ఒకేసారి నగదు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై స్పష్టత ఇచ్చి ంది..అతివలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూ స్తోన్న ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు శనివా రం కర్నూలులో అధికారికంగా ప్రకటించారు. పాఠశాలలు తెరిచేసరికి తల్లికి వందనం పథకం కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే వారం దరికి ప్రభుత్వం నగదు జమ చేయ నుంది. మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల హామీకి సంబం ధించి ప్రస్తు తం ఒక్కో సిలిండర్‌కే నగదు జమ చేస్తుండగా.. ఇకపై ఒకేసారి మూడు సిలిండర్ల నగదు ఒకేసారి మహిళల ఖాతాల్లో జమచేయబో తున్నట్టు ఇటీ వల చంద్రబాబు ప్రకటించారు. ఇలా ఎన్నికల ముందు టీడీపీ ప్రకటించిన మూడు సూపర్‌ సిక్స్‌ హామీల అమ లుకు చకచకా అడుగులు వేస్తుండడంతో మహి ళలకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరబోతోంది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున..

సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు సీఎం చంద్ర బాబు చకచకా అడుగులు వేస్తున్నారు. ప్రధా నంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పథకాలను నెరవేర్చడానికి కసరత్తు తీవ్రం చేశారు.తాజాగా శనివారం కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణ పథకం అమలు చేయనున్నట్టు అధికారి కంగా ప్రకటించారు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 25.52 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానా.. లేదా విభ జిత జిల్లాల ప్రాతిపదికన ఉచిత బస్సు పథ కం అమలు చేస్తారా అనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆర్టీసీ చార్జీలను పెం చేసి పేదల నడ్డివిరగ్గొట్టింది. కొద్దిపాటి దూరా నికే షాక్‌కొట్టే చార్జీలు వసూలు చేసింది. దీంతో టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం పథ కాన్ని ప్రకటించింది. కూటమిని గెలిపిస్తే ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చిం ది.పథకం అమలు ప్రకటించడంతో మహిళ ల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

తల్లికి..రాబడి..

తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెలలో స్కూ ళ్లు తెరిచేలోగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తాజాగా సీఎం చంద్రబాబు ప్రక టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షల మం ది పేద, మధ్య తరగతి తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా ప్రక టించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యట న లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని బడులు తెరిచేలోపు అమలు చేస్తామని ప్రక టించారు. వాస్తవానికి గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి మోసగించింది. సీఎం చంద్రబాబు ఇటీవల బడ్జెట్‌లో పథకానికి ప్రాధాన్యత కల్పించారు. వచ్చే నెలలోగా జమ కానున్న తల్లికి వందనం డబ్బులు ఉమ్మడి తూర్పుగోదావరిలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 16.51 లక్షల మంది పిల్ల లకు సంబంధించి వారి తల్లులకు ఆర్థిక ప్ర యోజనం కలగనుంది. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.15 వేల చొప్పున ఉమ్మడి జిల్లాకే ఏకంగా రూ.2,476 కోట్ల వరకు నిధుల అవసరం. కా కినాడ జిల్లా చూసుకుంటే 6.20 లక్షల మంది పిల్లల తల్లులకు ప్రయోజనం కలగనుంది.

గ్యాస్‌ డబ్బులూ ఒకేసారి..

మహిళలకు ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సి లిండర్లను అందిస్తామన్న హామీ మేరకు ఇప్ప టికే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు.మహిళలు సిలిండర్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొద్దిరోజులకే ఆ డబ్బులను బ్యాంకు ఖా తాల్లో జమ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో 13 లక్షల వరకు గ్యాస్‌ కనెక్షన్లు ఉ న్నాయి.తొలి ఉచిత సిలిండర్‌ కింద ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 11.52 లక్షల మంది ఈ సదు పాయం వినియోగించుకోగా రూ.95 కోట్లు బ్యాం కు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రెండో ఉచిత సిలిండర్‌ ఇప్పటికే 6.70 లక్షల మంది తీసుకున్నారు.డబ్బులు ఖాతాల్లో జమవుతున్నా యి.ఇకపై విడివిడిగా కాకుండా మూడు సిలిం డర్లు బుక్‌ చేసుకున్నా చేసుకోకపోయినా ముందే నగదు ప్రభుత్వం ఖాతాల్లో జమచేయబోతోంది.

Updated Date - May 18 , 2025 | 12:59 AM