విలువలతో కూడిన విద్యాబోధనతోనే ఉన్నత భవిష్యత్
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:54 AM
విలువలతో కూడిన విద్యాబోధనతోనే భవిష్యత్తు సమాజం ఉన్నత స్థానంలో ఉంటుందని డీఈవో డాక్టర్ షేక్ సలీంబాషా పేర్కొన్నారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్16(ఆంధ్రజ్యోతి): విలువలతో కూడిన విద్యాబోధనతోనే భవిష్యత్తు సమాజం ఉన్నత స్థానంలో ఉంటుందని డీఈవో డాక్టర్ షేక్ సలీంబాషా పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి ధార్మిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకుసూచించారు. అమలాపురం గొల్లగూడెంలోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ పురపాలక సంఘ ఉర్దూ ప్రాథమిక పాఠశాల 107వ వార్షికోత్సవం హెచ్‌ఎం ఎంఎంకేజీ మొయినుద్దీన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఈవో సలీంబాషా మాట్లాడుతూ గొల్లగూడెం ఉర్దూ ప్రాథమిక పాఠశాల నూతనవిద్యా సంవత్సరం నుంచి మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఎంపిక చేశామన్నారు. ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున ఐదుగురు ఉపాఽధ్యాయులు ఉంటారని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదేపాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.హుస్సేన్ రాష్ట్ర ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోగా, స్కూలుఅసిస్టెంట్‌గా పదోన్నతి పొంది మరొక ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళుతున్న కేఆర్‌ఎన్ ప్రసాద్‌లను డీఈవో సలీంబాషా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు ఎంఎస్‌ఎన్ మూర్తి, బీవీఎస్సీ పోలిశెట్టి, అనూష పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:54 AM