ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోల్డ్‌ అంతా దోచేసి.. రోల్డుగోల్డ్‌ వదిలేసి..

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:46 AM

కొత్తపల్లి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్పలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడి 12 తులాల బంగారు ఆభరణాల తో పాటు రూ.1.20లక్షల నగదును అపహరించు కునిపోయారు. కేవలం బంగారు వస్తువులనే తీసుకుని రోల్డుగోల్డ్‌ ఆభరణాలను ది

దొంగలు వదిలేసిన రోల్డుగోల్డ్‌ ఆభరణాలు

వాకతిప్పలో చోరీ

12 తులాల బంగారు ఆభరణాలు,

రూ.1.20 లక్షల నగదు పట్టుకెళ్లిన దొంగలు

కొత్తపల్లి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్పలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడి 12 తులాల బంగారు ఆభరణాల తో పాటు రూ.1.20లక్షల నగదును అపహరించు కునిపోయారు. కేవలం బంగారు వస్తువులనే తీసుకుని రోల్డుగోల్డ్‌ ఆభరణాలను దివాన్‌కాట్‌పై పెట్టేసి వెళ్లిపోయారు. వివరాల ప్రకారం.. కొత్త పల్లి మండలం పొన్నాడు శివారు శీలం వారి పాలెం ఎలిమెంట్రీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పేరూరి శ్రీనివాసరావు వాకతిప్పలో నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఈనెల 2న అన్నవరంలో ఉంటున్న బంధువుల వద్దకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు 3వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక పిట్టగోడ నుంచి లోపలికి ప్రవేశించారు. ఇంటి రెండు గదుల్లో ఉన్న బీరువాలను మారుతాళాలతో తెరిచి లాకర్లో ఉన్న 12 తులాల బంగారు ఆభ రణాలు, రూ.లక్ష నగదు, హాలు లో బాక్స్‌లో వేసిన 10 రూపా యల కాయిన్లు రూ.20 వేలను అపహరించుకుని పోయారని శ్రీనివాసరావు కొత్తపల్లి పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. బుధవారం తెల్లవారుజాము సమయంలో తమ ఇంటి పరిసరాల్లో ఉండే ఒ కరు ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని ఫోన్‌లో చెప్పడంతో సీసీటీవీని పరిశీలించేసరికి తమ ఇంటి గుమ్మం వద్ద సీసీ కెమెరా వేలాడుతూ కనిపించడంతో వెంటనే అన్నవరం నుంచి బయలుదేరి ఇంటికి చేరుకుని చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని, బీరువాలో ఉన్న బంగారు ఆభరణా లు, నగదు చోరీకి గురయ్యాయని శ్రీనివాసరావు పేర్కొన్నాడు. కేవలం బంగారు వస్తువులనే తీసుకుని రోల్డుగోల్డ్‌ ఆభరణాలను దివాన్‌కాట్‌పై పెట్టేసి పోయినట్టు గుర్తించారు. కొత్తపల్లి ఎస్‌ఐ జి.వెంకటేష్‌ చోరీ జరిగిన ఇంట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఇంటి వెనుక నుంచి లోపలికి వచ్చి సీసీ కెమెరాను పక్కకు తిప్పినట్టుగా ఉండటం రికార్డు అయ్యిం ది. ఇంటి లోపలకు వెళ్లినట్టు ఏ ఆధారాలు లేకు ండా దొంగలు చాకచక్యంగా చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు బీరువాలు, ఇంటి తలు పులపైన వేలిముద్రలను సేకరించారు. శ్రీనివా సరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 12:46 AM