ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

22 నుంచి డెల్టా కాలువలు మూసివేత

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:33 AM

డెల్టా కాలువలు ఈనెల 22 నుంచి మూసివేయ నున్నారు.

కాలువలకు విడుదలవుతున్న నీరు

ధవళేశ్వరం,ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): డెల్టా కాలువలు ఈనెల 22 నుంచి మూసివేయ నున్నారు. రబీ అనంతరం ఖరీఫ్‌లో సాగునీరు సక్రమంగా పారేందుకు డెల్టా కాలవల షెట్టర్‌ లు, లాకులు వంటి మరమ్మతులు(క్లోజర్‌ పనులు) చేపట్టడానికి కాల్వలకు నీటి విడుదల నిలిపివేస్తారు.డెల్టా కాలువలు ఈనెల 16వ తేదీనే మూసివేసేందుకు సిద్ధంకాగా గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపుకోవడం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఈ నెల 22 వరకు నీటిని విడుదల గడువు పెంచారు. ఇరిగేషన్‌ మంత్రి ఆదే శాలతో కాల్వల మూసివేతను 22వ తేదీ వరకు వాయిదా వేశారు. బుధవారం కాటన్‌బ్యారేజ్‌ నుంచి తూర్పుడెల్టాకు 1200 క్యూసెక్కులు, మధ్యడెల్టాకు 1100 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరంవద్ద నీటిమట్టం 9.30 అడుగులుగా నమోదైంది.

రబీని గట్టెక్కించిన సీలేరు జలాలు

తూర్పు,మధ్య, పశ్చిమ డెల్టాలోని 8.96 లక్షల ఎకరాలకు రబీలో సాగునీటిని సమవృద్ధిగా అం దించారు. డిసెంబర్‌ నుంచి నేటి వరకు మూడు డెల్టా కాలువలకు 114.644 టీఎంసీల నీటిని కా టన్‌ బ్యారేజ్‌ నుంచి విడుదల చేశారు. సీలేరు నుంచి పవర్‌ జనరేషన్‌ద్వారా 44.084 టీఎంసీ లు గోదావరికి విడుదల కాగా బైపాస్‌ మార్గం ద్వారా నేరుగా 17.781టీఎంసీలు విడుదల చేశా రు. సీలేరు నుంచి మొత్తం 61.865 టీఎంసీలు గోదావరికి విడుదలయ్యాయి.పోలవరం వద్ద 16 టీఎంసీల నీటి నిల్వలు ఉంటాయని అధికారు లు లెక్కకట్టగా రబీ సీజన్‌లో గోదావరిలో సహ జ జలాల లభ్యత 36 టీఎంసీలకు పైగా ఉంది. గత రబీసీజన్‌లో అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొన్నారు. అప్పట్లో మార్చి నెలాఖరు నాటికి ఽధవళేశ్వరంవద్ద గోదావరి నీటిమట్టం 5.50 అడుగుల కు పడిపోయింది. పాండ్‌లో నీరు డెల్టా కాలువలకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నాయకులు,అధికారుల సమన్వయంతో రబీకి సమృద్ధిగా సాగునీరందించారు.

Updated Date - Apr 17 , 2025 | 12:33 AM