ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారిని ముంచేసిన వరద!

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:19 AM

పి.గన్నవరం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఎగువున వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరికి వరద నీరు ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. ఈ క్రమంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడి, ఉడిమూడికి చెందిన నాలుగు లంకగ్రా మాల ప్రజానీకం రాకపోకలు సాగించేందుకు బూరు గు లంక నదీపాయలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారి గురువారం తెల్లవారుజామున వరద నీటిలో కొట్టుకుపోయింది.

గంటిపెదపూడిలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి

కోనసీమను తాకిన గోదావరి నీరు

గంటిపెదపూడి బూరుగులంకలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

నాలుగు లంక గ్రామాలకునిలిచిన రాకపోకలు

ఇంజన్‌ పడవలపై ప్రయాణాలు

పి.గన్నవరం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఎగువున వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరికి వరద నీరు ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. ఈ క్రమంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడి, ఉడిమూడికి చెందిన నాలుగు లంకగ్రా మాల ప్రజానీకం రాకపోకలు సాగించేందుకు బూరు గు లంక నదీపాయలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారి గురువారం తెల్లవారుజామున వరద నీటిలో కొట్టుకుపోయింది. వరదనీరు గట్టును తాకిన అరగంటలోనే గ ట్టు వరద ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గంటిపెదపూడి శివారు పెదపూడిలంక, బూరుగులంక, అ రిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడి మూడిలంక గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇంజన్‌ పడవలపైనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు తరలించే రైతులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. నిత్యాసర వస్తువులు తెచ్చుకోవడానికి లంక గ్రామాల ప్రజా నీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా గ్రామాలైన అనగార్లంక, పెదమల్లంక గ్రామస్తులు వైవిపాలెం, బెల్లంపూడి వద్ద నదీపాయల్లోకి వరదనీరు రావడంతో ఆ గ్రామాల ప్రజలు నాటుపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.

లైఫ్‌జాకెట్లు ధరించడం తప్పనిసరి : ఆర్డీవో

లంకగ్రామస్తులు నదీపాయ దాటే సమయంలో తప్ప నిసరిగా లైఫ్‌జాకెట్లు ధరించాలని ఆర్డీవో పి.శ్రీకర్‌ సూచిం చారు. లైఫ్‌జాకెట్లు ధరించనివారిని దాటించవద్దని హెచ్చ రించారు. పడవపై పదిమందిని మాత్రమే దాటించాలన్నా రు. ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశామన్నా రు. ప్రస్తుతం 2 ఇంజన్‌ పడవలు తిరుగుతున్నాయని, వాటిలో లైఫ్‌జాకెట్లు ఏర్పాటు చేశామన్నారు. లంక గ్రా మాల నుంచి సుమారు 40 మంది విద్యార్థుల వరకు బ యట పాఠశాలల్లో చదువుకుంటున్నారని రోజూ పడవలు దాటే వారికి ప్రత్యేక లైఫ్‌జాకెట్లు ఏర్పాటు చేశామన్నారు. నదీపాయకు ఇరువైపూలా రెవెన్యూ, పోలీసు, ఫైర్‌ సిబ్బం దిని ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికా రి, డీఆర్‌డీఏ పీడీ టీ.సాయినాధ్‌ జయచంద్ర గాంధీ, తహ శీల్దార్‌ పి.శ్రీపల్లవి నాలుగు లంక గ్రామాల్లో పర్యటించారు.

Updated Date - Jul 11 , 2025 | 01:19 AM