నదీకోత నివారణకు చర్యలు తీసుకుంటాం
ABN, Publish Date - May 31 , 2025 | 12:33 AM
గోదావరి నదీతీర ప్రాంతంలో నదీ కోత నివారణకు చర్యలు తీసుకుంటామని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.
మామిడికుదురు, మే 30(ఆంధ్రజ్యోతి): గోదావరి నదీతీర ప్రాంతంలో నదీ కోత నివారణకు చర్యలు తీసుకుంటామని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే శుక్రవారం గోదావరిలో బోటుపై వెళ్లి పాశర్లపూడిలో కోతకు గురవుతున్న కొబ్బరి తోటలను పరిశీలించారు. విలువైన సారవంతమైన భూములు నదీ గర్భంలో కొట్టుకు పోతున్నాయని స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ నదీ కోతనివారణకు గ్రోయిన్ల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు సిద్ధంచేసి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నదీ కోత నివారణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. సర్పంచ్‌లు తెలగారెడ్డి సూర్యప్రకాశరావు, చెల్లుబోయిన శివరామసుబ్రహ్మణ్యం, బళ్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, జనసేన మండలశాఖ అధ్యక్షుడు జాలెం శ్రీనివాసరాజా, గంధం భాస్కర్, తుండూరి బుజ్జి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం స్పందించాలి
Updated Date - May 31 , 2025 | 12:33 AM