ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోదారంత విషాదం

ABN, Publish Date - May 27 , 2025 | 01:02 AM

మొగ్గతొడిగిన ఆశలు నిండు గోదావరిలో గల్లంతయ్యాయి. కన్నకలలన్నీ కన్నీటి సంద్రంగా మారాయి. వారి తల్లిదండ్రుల గుండె కన్నీటి గోదారైంది. అప్పటిదాకా ఆనందం.. ఉల్లాసం.. కేరింతలు.. సరదా సరదాగా సాగిపోయిన క్షణాలు. ఒక్కసారిగా గోదారంతా విషాదం.ఒక్కరా ఇద్దరా ఏకంగా 8 మంది స్నేహితులు గోదావరిలో గల్లంతయ్యారు..

  • గోదారిలో ఎనిమిది మంది గల్లంతు

  • ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం వద్ద ఘటన

  • స్నానానికి వెళ్లిన 11 మంది

  • ఒకరిని కాపాడదామని మరొకరు

  • వీరిలో నలుగురు సోదరులే

  • సురక్షితంగా బయటపడిన ముగ్గురు

  • ఒక వేడుకకు వచ్చిన స్నేహితులు

  • కుటుంబాల్లో విషాదఛాయలు

  • ముమ్మర గాలింపు చర్యలు

మొగ్గతొడిగిన ఆశలు నిండు గోదావరిలో గల్లంతయ్యాయి. కన్నకలలన్నీ కన్నీటి సంద్రంగా మారాయి. వారి తల్లిదండ్రుల గుండె కన్నీటి గోదారైంది. అప్పటిదాకా ఆనందం.. ఉల్లాసం.. కేరింతలు.. సరదా సరదాగా సాగిపోయిన క్షణాలు. ఒక్కసారిగా గోదారంతా విషాదం.ఒక్కరా ఇద్దరా ఏకంగా 8 మంది స్నేహితులు గోదావరిలో గల్లంతయ్యారు.. సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని వెళ్లారు.. ఒకరి వెంట ఒకరు ఏకంగా ఎనిమిది మంది గోదారిలోకి జారిపోయారు. ఎదుగుతున్న వయస్సు ఆ పిల్లలందరిదీ. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. కన్నా ఎక్కడున్నావ్‌.. రా నాన్నా.. అమ్మను వచ్చాను రారా.. అంటూ తల్లులు.. నాన్నా ఎక్కడున్నావ్‌.. రారా.. అంటూ తండ్రులు పిలుస్తున్నా.. వారి జాడేది..? గోదావరి ఒడ్డున దుఃఖ సాగరంలో ఉన్నారంతా. ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియదు.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరిలో గల్లంతైన తమ పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని కన్నపేగు కొట్టుమిట్టాడుతోంది.. కనిపించినవారినల్లా కాపాడాలని వేడుకుంటోంది.

ముమ్మిడివరం, మే 26 (ఆంధ్రజ్యోతి) : గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధి సలాదివారిపాలెం వద్ద సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మొత్తం 11 మంది యువకులు స్నానానికి వెళ్లగా ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానికులు వందలాదిగా నదీ తీర ప్రాంతానికి చేరుకున్నారు.ఈ ఘటనలో కాకినాడ ప్రాంతానికి చెందిన నలుగురు, ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన ఇద్దరు సోదరులు, కె.గంగవరం మండలం శేరికలంకకు చెందిన ఒకరు, మండపేటకు చెందిన ఒకరు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్‌ ఆహ్వానంపై వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు హాజరయ్యారు. అందరూ సరదాగా వేడుకలో పాల్గొని విందు భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది మిత్రులు వెళ్లారు. బట్టలు, చెప్పులు, షూలు, సెల్‌ఫోన్లను ఒడ్డున పెట్టి స్నానానికి ఉపక్రమించారు. తొలుత ఒక యువకుడు స్నానానికి దిగాడు. ఒడ్డున స్నానం చేయడం వీలు పడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లేసరికి లోతుగా ఉండడంతో మునిగిపోయా డు. అది గ్రహించిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి వెళ్లారు. వారు కూడా మునిగిపోతుండడంతో మరో ఇద్దరు ఇలా ఒకరి తరువాత ఒకరు నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్‌ (17), మేడిశెట్టి చరణ్‌రోహిత్‌ (20), కనికెళ్ల సురేష్‌ (19) సురక్షితంగా బయటపడ్డారు.సాన్నానికి వెళ్లిన పదకొండు మందిలో ఎనిమిది మంది గల్లంత య్యారు. కరుణకుమార్‌ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంజను పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, ఎస్పీ బి.కృష్ణారావు, జేసీ టి.నిషాంతి, ఆర్డీవో కె.మాధవి, సీఐలు ఎం.మోహన్‌కుమార్‌, వెంకటనారాయణ, ఎస్‌ఐలు డి.జ్వాలాసాగర్‌, జానీబాషాలతోపాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగమంతా అక్కడికి చేరుకుని రాత్రివేళల్లో గాలింపు చర్యలు చేపట్టే అంశంపై చర్చలు జరిపారు. కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, ఎస్పీ కృష్ణారావులు ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని గౌతమి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి.

గల్లంతైన వారి వివరాలు ఇలా..

కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతిఇమ్మానియేలు(19), సబిత పాల్‌ (18), తాతిపూడి నితీష్‌ (18), ఎలుమర్తి సాయి (18), మండపేటకు చెందిన రోహిత్‌ (18), శేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్‌ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ములైన వడ్డే మహేష్‌ (16), వడ్డే రాజేష్‌ (14) గల్లంతయ్యారు. వీరి కోసం ప్రస్తుతం గౌతమీ గోదావరి నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆ చెల్లికి దిక్కెవరు!

మండపేట: రోహిత్‌ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెం దారు.. చెల్లికి అతనే ఆధారం. మండపేట మండలం ఆర్తమూ రుకు చెందిన రోహిత్‌ తల్లిదండ్రులు కులపాక లలితాదేవి, రవీంద్రభాస్కర్‌ ప్రసాద్‌. వీరికి ఒకమ్మాయి,అబ్బాయి రోహిత్‌. వీరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతిచెందడంతో అతడి అమ్మమ్మ కోరంగి వద్ద మిషనరీ పాఠశాలలో చేర్పించి పిల్లలను చదివించింది. మిష నరీలో పదవ తరగతి తర్వాత రోహిత్‌ కాకినాడలోని పాలిటెక్నిక్‌లో చేరి మధ్యలోనే చదువు మానేశాడు.అతడి సోదరి ప్రస్తుతం సెకం డియర్‌లో ఉంది.కులపాక రోహిత్‌ (19) స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులో పని చేస్తూ చెల్లెలితో కలిసి గొల్లపుంత కాలనీలో నివాసం ఉంటున్నాడు. గోదావరిలో రోహిత్‌ గల్లంతయ్యాడన్న విషయం తెలుసు కుని రోహిత్‌ పెద్దమ్మ, పెదనాన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అన్న మర ణంతో సోదరికి జీవితం అగమ్యగోచరంగా మారింది

ఆ తల్లికి కడుపుకోత..

ఐ.పోలవరం, మే 26(ఆంధ్రజ్యోతి): అమ్మమ్మ ఇంటికి జాతరకని వెళ్లిన అన్నదమ్ములు పదవ తరగతి చదువుతున్న వడ్డి మహేష్‌ (16), ఎనిమిదవ తరగతి చదువుతున్న వడ్డి రాజేష్‌(14) గోదావరిలో గల్లంతవ్వడంతో ఊరంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జి.మూలపొలం పంచాయతీ ఎర్రగరువుకు చెందిన వడ్డి భైరవస్వామి, భవానీ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లి భవాని కువైట్లో ఉండగా తండ్రి భైరవస్వామి వ్యవసాయంతో పాటు ఎలక్ట్రికల్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అమ్మా నాన్నలకు తోడెవరు..

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)/కాకినాడ క్రైం:

అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. తండ్రి నిర్వహించే చర్చిలోనే ఒకరు రిథమ్‌ ప్లేయర్‌గా, మరొకరు సింగర్‌. కాకినాడ జగన్నాథపురం యాళ్లవారిగరువు గోలీలపేట తుఫాను బిల్డింగ్‌ ప్రాం తంలో నివసించే పాస్టర్‌ సబ్బిత రఘు, విజయ దంపతులకు ఇద్దరు కు మారులు. పెద్దకుమారుడు క్రాంతి, చిన్నబ్బాయి పాల్‌ డిగ్రీ చదువుతున్నా రు. వీరు కొన్నేళ్లుగా మౌంట్‌మోరియా మినిస్ర్టీస్‌ తండ్రి సన్నిధి పేరిట పాస్టర్‌ రఘు చర్చి నిర్వహిస్తున్నారు. ఈ చర్చికి నిత్యం వచ్చే అభి, పా స్టర్‌ రఘు తనయులు స్నేహితులుగా మెలిగేవారు. వీరింటికి సమీపంలో ఉండే దాసరి కరుణకుమార్‌ స్నేహితుడే. వీరంతా కలిసి అభి చెల్లెలి ఫం క్షన్‌ నిమిత్తం కాకినాడ జగన్నాథపురంనుంచి ఉదయం పది గంటల సమయంలో కె.గంగవరం మండలం శేర్లంకకు వెళ్లారు. కాకినాడకు అన్నమ్మఘాటీ ముగ్గుపేటకు చెందిన తాతిపూడి రాజు, వరలక్ష్మి దంపతుల కుమారు నితీష్‌ కూడా అక్కడకు వెళ్లాడు. అతడు సంజీవి డిగ్రీకళాశాల లో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్‌, తల్లి గృహిణి. ప్రస్తుతం వీరి కుటుంబం గురజనాపల్లిలో ఉంటోంది. కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలోని మీసాల చిన్నయ్యపేటకు చెందిన యలమర్తి ప్రసాద్‌ కుమారుడు సాయి మహేష్‌(19). తండ్రితో కలిసి ఆయిల్‌ కంపెనీలో చేస్తున్నాడు. అతడు కూడా స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. వీరి స్వస్థలం రాజోలు మండలం పొన్నమండలోని మెరకపాలెం కాగా ఉపాధి నిమిత్తం తూరంగిలో ఉంటున్నారు.

కళ్లెదుటే మునిగిపోయారు..

గోదావరిలో కళ్లెదుటే మిత్రులంతా ఒక్కొక్కరిగా మునిగిపోతున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లినవారు మునిగిపోతున్నారు. వారిని కాపాడేందుకు విఫలయత్నం చేశాం. పరిస్థితి చేజారిపోవడంతో ఒడ్డుకు చేరుకున్నాం. ఈ సమాచారాన్ని స్థానికులకు తెలియజేశాం. మిత్రులంతా కళ్లెదుటే ఒక్కొక్కరిగా గల్లంతు కావడంతో కరుణకుమార్‌ రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఇదే విషయం అధికారులు, జిల్లా ఎస్పీకి వివరించాడు.

- దాసరి కరుణకుమార్‌, ప్రత్యక్ష సాక్షి

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా..

ముమ్మిడివరం/రామచంద్రపురం (ద్రాక్షారామ), మే 26(ఆంధ్రజ్యోతి): గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఫోన్‌లో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.

బాధితులకు అండగా ప్రభుత్వం

బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటుందని నాయకులు చెప్పారు. రాజమహేం ద్రవరం ప్రమాదం, గోదావరిలో స్నానానికి వెళ్లి 8 మంది గల్లంతు కావడంపై ఎంపీ పురందేశ్వరి, మంత్రి దుర్గేష్‌, మంత్రి సుభాష్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. సుభాష్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ లతో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. యువకులు గల్లంతైన ఘటనపై ప్రభుత్వ విప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్‌, పోలీసు అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

Updated Date - May 27 , 2025 | 01:02 AM