రివర్ ఫ్రంట్ పనులు ఆరు నెలల్లో పూర్తి
ABN, Publish Date - Jun 29 , 2025 | 01:12 AM
రివర్‌ఫ్రంట్ పనులు ఆరు నెలల్లో పూ ర్తవుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం రాజమహేంద్రవరం గోదావరి బండ్ రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 28(ఆంధ్ర జ్యోతి): రివర్‌ఫ్రంట్ పనులు ఆరు నెలల్లో పూ ర్తవుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం రాజమహేంద్రవరం గోదావరి బండ్ రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖం డ గోదావరి ప్రాజెక్టులు ఒక చరిత్రగా నిలుస్తాయన్నారు. గోదావరి గట్టున ఉన్నప్రముఖుల విగ్రహాలు మరింత అందంగా తీర్చిదిద్ది పునఃప్రతిష్ఠ చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు పెరుగుతాయని,వ్యా పారాలు అభివృద్ధి చెందుతాయన్నా రు. రివర్ ఫ్రంట్ పనులను ప్రజ లు చూసేందుకు భద్రత కారణాల రీత్యా ఇప్పుడు కుదరదని, పిల్లల జారి పడే ప్రమాదముందని, అందు కే గ్రీన్ మ్యాట్ వేసి లోపల అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. నగరాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి చర్యలు చేపట్టిందని, ఇది చూసి తట్టుకోలేక తమ హయాంలో ఇలా చెద్దామనుకున్నాం, అలా చెద్దామనుకున్నాం అని ఇప్పుడు డప్పుకొట్టొదని మాజీ ఎంపీకి ఎమ్మెల్యే వాసు హితబోధ చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్లతో ఎమ్మెల్యే సమావేశం
శనివారం సాయంత్రం రౌతు తాతాలు కళ్యాణ మండపంలో రేషన్ డీలర్లతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వార్డుల్లో నడవలేని స్థితిలో ఉన్న వారికి, వృద్ధులకు ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించాలన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో తప్పక రేషన్ పంపిణీ జరగాలని, ఎక్కడా లోపాలు లేకుండా చూడాలన్నా రు. పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక లోపా లుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకుని సేవలందించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ సేవలు అందించా లన్నారు. సమావేశంలో తహశీల్దార్ పాపారావు, ఆర్‌ఎస్‌వో వాసు, రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జామి కృష్ణ, బత్తిన నారాయణ, కేఎస్‌వి రామారావు, నమ్మి వెంకటేశ్వరావు, ఆర్‌ఎస్ రమేష్, ఆదిరాజు, 102 మంది రేషన్ డీలర్ల పాల్గొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 01:12 AM